News February 14, 2026

కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల

image

కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.kakatiya.ac.inలో చూడవచ్చన్నారు. అన్ని కోర్సులు కలిపి మొదటి సెమిస్టర్ 27 శాతం, మూడో సెమిస్టర్ 31 శాతం, ఐదో సెమిస్టర్ 42 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Similar News

News April 20, 2026

GK: ముఖ్యమైన సంస్థలు – హెడ్‌క్వార్టర్స్

image

* WHO – జెనీవా
* UNESCO – పారిస్
* ILO – జెనీవా
* FAO – రోమ్
* UNICEF – న్యూయార్క్
* IMF – వాషింగ్టన్, డి.సి
* World Bank – వాషింగ్టన్, డి.సి
* WTO – జెనీవా

News April 20, 2026

మెదక్: ఎర్రవల్లి నుంచి జగిత్యాలకు KCR

image

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేడు సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో జగిత్యాలకు బయలుదేరనున్నారు. జగిత్యాల కలెక్టరేట్ వద్ద హెలిప్యాడ్‌లో దిగిన అనంతరం నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరి ప్రజాసభలో పాల్గొననున్నారు.

News April 20, 2026

కడప రిమ్స్ వద్ద హత్య.. 11 మంది అరెస్ట్?

image

కడప రిమ్స్ వద్ద ఇటీవల దస్తగిరి అనే వ్యక్తిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మారెమ్మ జాతరలో జరిగిన చిన్న వివాదం హత్యకు దారితీసింది. వీరిని న్యాయమూర్తి ముందు హాజరు పరచగా రిమాండ్‌ విధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కడప డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్సైలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.