News February 14, 2026

సిరిసిల్ల: ఆ నలుగురిలో ఎవరికి పీఠం దక్కెదెవరికి..?

image

సిరిసిల్ల పుర పీఠంపై బీఆర్ఎస్‌లో పోటీ పెరిగింది. గెలిచిన అభ్యర్థుల్లో చైర్మన్ కోసం ప్రధానంగా నలుగురు పోటీలో ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ చైర్ పర్సన్, 3వ వార్డు కౌన్సిలర్ జిందం కళ, 30వ వార్డు కౌన్సిలర్ మంచే రేణుక, 5వ వార్డు కౌన్సిలర్ దార్నం అరుణ, 36వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రేణుక ఆశావాహుల్లో జాబితాలో ఉన్నారు. KTR ఆశీస్సులు ఎవరికి ఉండనున్నాయో, పీఠం దక్కేదేవరికో అని పట్టణంలో జోరుగా చర్చ సాగుతుంది.

Similar News

News April 17, 2026

సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా చెస్ పోటీలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు ఏప్రిల్ 19న సూర్యాపేట టీటీడీ కళ్యాణ మండపంలో జరగనున్నాయి. అండర్ 7, 11, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తారు. ఎఫ్ఐడీఈ (FIDE) నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వివరాల కోసం 9394753343 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

News April 17, 2026

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం నగరంలోని ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం అరైవ్ అలైవ్ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. గోల్డెన్ అవర్‌లో సహాయం చేసిన వారికి రాహవీర్ పథకం కింద రూ.25 వేలు బహుమతి అందిస్తామని చెప్పారు. 30 బ్లాక్ స్పాట్ల సరిదిద్దడంతో ప్రమాదాలు తగ్గాయని వివరించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై ఏఐ ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 17, 2026

తాత్కాలిక సీజ్‌ఫైర్‌లు మాకొద్దు: ఇరాన్

image

లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య 10రోజుల సీజ్‌ఫైర్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. లెబనాన్ నుంచి మొదలుకొని ఎర్రసముద్రం వరకు ఈ ఏరియాలో ఎలాంటి అశాంతి లేకుండా ఉండటమే తమకు కావాలని స్పష్టం చేసింది. తాత్కాలిక సీజ్‌ఫైర్‌లను ఒప్పుకోబోమని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న హింస ఇక్కడితో శాశ్వతంగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ వెల్లడించారు.