News May 1, 2024

సీఎం జగన్ నేటి ప్రచార షెడ్యూల్

image

AP: సీఎం జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు బొబ్బిలి మెయిన్ రోడ్ సెంటర్‌లో, మధ్యాహ్నం 12.30 గంటలకు పాయకరావుపేటలోని సూర్య మహల్ సెంటర్‌లో, మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులో ఫైర్ స్టేషన్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

Similar News

News March 7, 2026

హెయిర్ కట్ సరిగా చేయలేదని ₹25లక్షల ఫైన్

image

హెయిర్ కట్‌లో పొరపాటు భారీ మూల్యం చెల్లించేలా చేసింది. 2018లో ఓ మోడల్ హెయిర్ కట్ కోసం ముంబై ITC హోటల్ సెలూన్‌కు వెళ్లింది. స్టైలిస్ట్ చేసిన వర్క్ ఆమెకు నచ్చలేదు. దీంతో తాను మానసికంగా కుంగి మోడలింగ్, ఇంటర్వ్యూ అవకాశాలు కోల్పోయానని కన్జూమర్ ఫోరంలో కంప్లయింట్ చేసింది. కమిషన్ 2021లో ₹2కోట్ల పరిహారం ప్రకటించగా, ITC సుప్రీంకు వెళ్లింది. దీంతో తీర్పు రివైజ్ చేస్తూ ₹25 లక్షలు ఇవ్వాలని SC ఆదేశించింది.

News March 7, 2026

వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

image

తమ బ్యాంకులో లోన్లు తీసుకున్న వారికి HDFC బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. నిధుల ఆధారిత రుణ రేట్ల(MCLR)పై 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం కలగనుంది. గృహ, వ్యక్తిగత లోన్లపై EMIలు తగ్గనున్నాయి. నేటి నుంచే ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. తాజా తగ్గింపుతో టెన్యూర్‌ను బట్టి MCLR రేట్లు 8.15%-8.55% మధ్య ఉండనున్నాయి. గతంలో 8.25%-8.60% మధ్య ఉండేవి.

News March 7, 2026

వాహనం తీస్తున్నారా? ఓ సారి చెక్ చేయండి!

image

ఎండ వేడిమికి మూగజీవాలు చల్లదనం కోసం ఆగి ఉన్న వాహనాల కింద తలదాచుకుంటుంటాయి. వాహనదారులు గమనించకుండా బండిని స్టార్ట్ చేసి ముందుకు తీయడం వల్ల ఇవి చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడటం, ప్రాణాలు కూడా కోల్పోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి వాహనం తీసే ముందు ఒక్కసారి కింద ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. అలాగే మిద్దెపై, ఆరుబయట పక్షుల కోసం నీటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.