News May 1, 2024
కర్నూలు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిని ఖైరతాబాద్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాలు..బేతంచెర్ల(M) మెుద్దవరానికి చెందిన మధు రెండేళ్ల కిందట ఓ యూట్యూబ్ ఛానల్‌లో కెమెరామెన్‌గా పనిచేశాడు. అక్కడ రైటర్‌గా పనిచేస్తున్న యువతిని పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. ఆమె తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేశాక పారిపోయాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News March 24, 2026
మార్చి 30న సామూహిక గృహ ప్రవేశాలు: కర్నూల్ కలెక్టర్

జిల్లాలో ఈ నెల 30న అన్ని నియోజకవర్గాల్లో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నందున ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఆప్షన్–3 కింద నిర్మించిన ఇళ్లలో గుర్తించిన లోపాలను వెంటనే సరిచేయాలని, రూఫ్ లెవెల్‌కు చేరిన ఇళ్లను ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్నారు.
News March 24, 2026
నేర నియంత్రణలో రాజీ పడవద్దు: SP విక్రాంత్

కర్నూలు జిల్లాలో నేర నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక దృష్టి, డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్, రాత్రి గస్తీ బలోపేతం చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను పకడ్బందీగా విచారించి పరిష్కరించాలన్నారు.
News March 24, 2026
ఎలక్టర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్ సిరి

ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో వీసీ నిర్వహించి సమీక్షించారు. ఆదోని, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో మ్యాపింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


