News February 14, 2026
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో అక్క తమ్ముళ్ల ఘనవిజయం

మున్సిపల్ ఎన్నికల్లో అక్క, తమ్ముడు ఘనవిజయం సాధించారు. 19వ వార్డుకు చెందిన బొద్దుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో దిగగా గెలుపొందారు. 18వ వార్డులో మెరుగు మంజుల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వేరువేరు పార్టీల నుంచి అక్క తమ్ముడు పోటీ చేసి గెలుపొందగా, విజయోత్సవ ర్యాలీలో ఒకే చోట కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.
Similar News
News April 20, 2026
NGKL: వడదెబ్బ నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో కలెక్టర్ బాదావత్ సంతోష్ వైద్య, ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లవద్దని, నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని కోరారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
News April 20, 2026
సిద్దిపేట: బసవన్న విగ్రహానికి కలెక్టర్ నివాళి

సిద్దిపేట జిల్లాలో బసవేశ్వర జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పొన్నాల బైపాస్ చౌరస్తా వద్ద ఉన్న బసవేశ్వర విగ్రహానికి జిల్లా కలెక్టర్ హైమావతి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బసవన్న సేవలను ఆమె స్మరించుకున్నారు.కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సయ్యద్ రఫీ, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.
News April 20, 2026
GNT: ఇస్రో ‘యువికా’కు జిల్లా విద్యార్థినుల ఎంపిక.. కలెక్టర్ ప్రశంసలు

జాతీయ స్థాయిలో ఇస్రో నిర్వహించిన ‘యువికా’ యంగ్ సైంటిస్ట్ అవార్డులకు ఎంపికైన జిల్లా విద్యార్థినులను కలెక్టర్ సాయి కాంత్ వర్మ అభినందించారు. ఫిరంగిపురం (M) వేములూరిపాడుకు చెందిన జ్యోతిర్మయి, వట్టిచెరుకూరు (M) ముట్లూరుకు చెందిన సుస్మితా చంద్ ఈ గౌరవం దక్కించుకున్నారు. సోమవారం DEO సలీం భాషాతో కలిసి కలెక్టరేట్‌లో వారు కలెక్టర్‌ను కలిశారు. విద్యార్థినుల ప్రతిభను కలెక్టర్ ప్రత్యేకంగా కొనియాడారు.


