News February 14, 2026
ఉమ్మడి ADBలో బీజేపీ కోటకు బీటలు

శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో బలమైన శక్తిగా ఉన్న బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ నుంచి నలుగురు MLAలు, ఒక MP ఉండటంతో బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయని భావించారు. కానీ అనూహ్యంగా ADB(21) మినహాయిస్తే నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల్లో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ప్రతిష్ఠాత్మకంగా భావించిన భైంసాలో సైతం చతికిలబడింది.
Similar News
News April 18, 2026
పల్నాడు: ‘ప్రవేశ పరీక్షల తేదీలు మార్చండి’

పాలిసెట్, ఏపీఆర్జేసీ (APRJC) ప్రవేశ పరీక్షల తేదీలను మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నెల 24న రెసిడెన్షియల్ కళాశాల పరీక్ష, 25న పాలిటెక్నిక్ పరీక్షలు వరుసగా ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా షెడ్యూల్‌ను సవరించాలని వారు విన్నవిస్తున్నారు.
News April 18, 2026
శ్రీకాకుళం: పనికి రాదని పడేసే జీడి తొక్కతో లాభాలు

ఒకప్పుడు ఉపయోగం లేక పారబోసే జీడితొక్క ఇప్పుడు మంచి ఆదాయ వనరుగా మారింది. పలాస-కాశీబుగ్గలో జీడి ఆయిల్ పరిశ్రమలు ఏర్పడడంతో తొక్కకు డిమాండ్ పెరిగింది. గతంలో కిలో రూ.3కు అమ్మిన జీడితొక్క ధర ప్రస్తుతం రూ.15కు చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో జీడిఆయిల్ ఎగుమతులు పెరగడం దీనికి కారణం. రోజుకు వేల బస్తాల తొక్క పరిశ్రమలకు చేరుతుండగా, వ్యాపారులు గోనె సంచుల్లో నిల్వ చేసి విక్రయస్తున్నారు.
News April 18, 2026
SRPT: రోడ్డు ప్రమాదంలో VRO మృతి

తిరుమలగిరి VRO ముస్తఫా శుక్రవారం రాత్రి దూరాజ్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన కుమార్తె వివాహ శుభలేఖలు పంచి కోదాడకు తిరిగి వస్తుండగా, జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే ముస్తఫా మృతితో తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మరణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.


