News February 14, 2026
పల్నాడు జిల్లాలో శివరాత్రి ఉత్సవాలు జరిగే శైవ క్షేత్రాలివే.!

పల్నాడు జిల్లాలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగే శైవ క్షేత్రాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. కోటప్పకొండ, అమరావతి, గుత్తికొండ బిలం, దైద బిలం, సత్రశాల, ఏలేశ్వరం గట్టు, గోగులపాడు, మన్నేపల్లి తండా, సంజీవకొండ, వినుకొండ లింగంగుంట్ల (పెదకూరపాడు)లో శివుడు వివిధ పేర్లతో పూజలు అందుకుంటున్నారు ప్రతి ఏటా ఆయా శైవ క్షేత్రాలలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అధికార యంత్రాంగం శివరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.
Similar News
News April 17, 2026
నంద్యాల జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

నంద్యాల జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 10,84,706 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పురుషులు 5,33,161 మంది, మహిళలు 5,51,420 మంది, ఇతరులు 125 మంది ఉన్నారు. నంద్యాల జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి.
News April 17, 2026
అనుమతి లేకుండా అల్లు అర్జున్ పేరు, ఫొటో వాడొద్దు: ఢిల్లీ హైకోర్టు

అల్లు అర్జున్ వ్యక్తిత్వ హక్కులను (Personality Rights) పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు <<19671551>>ఉత్తర్వులు<<>> జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా పేరు, వాయిస్, ఫొటోలు, సంతకాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని స్పష్టం చేసింది. డీప్‌ఫేక్, AI టెక్నాలజీతో తన వాయిస్‌ని క్లోనింగ్ చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేయడం వంటివి తన బ్రాండ్ విలువను, ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆయన కోర్టును ఆశ్రయించగా ఇలా స్పందించింది.
News April 17, 2026
తొర్రూర్: వడదెబ్బతో రైతు మృతి

తొర్రూరు(M) గుర్తూరులో రైతు సింగారం శ్రీనివాస్ (62) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. పొలం పనుల్లో ఉండగా ఎండ తీవ్రతకు ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం HYDలోని ఓ ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఎండలు ముదురుతున్న తరుణంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


