News February 14, 2026

కరీంనగర్‌లో ‘హస్తం’ విలవిల..!

image

కరీంనగర్ పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు పరాభవం ఎదురైంది. అభ్యర్థుల ఎంపికలో జాప్యం, వర్గపోరు పార్టీ అవకాశాలను దెబ్బతీశాయి. క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం, బీజేపీ దూకుడును అడ్డుకోవడంలో వైఫల్యం ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం, బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడంతో ఓటర్లు ముఖం చాటేశారు. వెరసి, నగరపాలక పీఠంపై ఆశలు ఆవిరయ్యాయి.

Similar News

News April 18, 2026

మెదక్: వారసత్వ సంపదను కాపాడుకుందాం..!

image

అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు విశేష ఆకర్షణగా నిలుస్తున్నాయి. గంభీరమైన మెదక్ ఖిల్లా, ఏడుపాయల ఆలయం, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చర్చి, వేల్పుగొండ ఆలయం వంటివి జిల్లా ఖ్యాతిని చాటుతున్నాయి. వీటితో పాటు కొంటూరు మసీదు, చందంపేట మెట్ల బావి, ఘనపూర్ ఆనకట్ట వంటి కట్టడాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ఈ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

News April 18, 2026

జగిత్యాలలో కేటీఆర్ పర్యటన.. BRSలోకి భారీగా చేరికలు

image

జగిత్యాలలో ఈనెల 20న నిర్వహించే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభ ఏర్పాటు పరిశీలించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు శనివారం రానున్నారు. మినీ స్టేడియంలో సభ ఏర్పాటు పరిశీలించిన అనంతరం మాజీమంత్రి జీవన్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. ఇదే సమయంలో గత 2 రోజులుగా కాంగ్రెస్‌లోని అసంతృప్త నాయకులను పెద్ద ఎత్తున BRSలో చేరికల కోసం జీవన్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు.

News April 18, 2026

మహబూబ్‌నగర్‌లో ఉపాధి శిక్షణ

image

మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 20, 21 తేదీల్లో ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగాల కోసం కంపెనీలు రానున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు https://forms.gle/a7ComMvBg6wmPXhT9 లింక్ ద్వారా నమోదు చేసుకుని, సర్టిఫికేట్లతో హాజరుకావాలని అధికారిణి మైత్రి ప్రియ కోరారు. వివరాలకు 89193 80410 నంబర్‌ను సంప్రదించవచ్చు.