News May 1, 2024
విశాఖ జిల్లాలో మహిళల ప్రాతినిధ్యం 14 శాతం మాత్రమే

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలుస్తున్న మహిళల శాతం విశాఖ జిల్లాలో తక్కువగా ఉంది. విశాఖ లోక్ సభ స్థానానికి 33 మంది, ఏడు అసెంబ్లీ స్థానాలకు 101 మంది మొత్తం 134 మంది ఎన్నికల బరిలో ఉండగా, వీరిలో 20 మంది మహిళలు ఉన్నారని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. వీరి శాతం పరిశీలిస్తే కేవలం 14 % ఉంది. ఎన్నికల బరిలో నిలిచే వారి సంఖ్య తక్కువగా ఉంటే విజయం సాధించి చట్టసభల్లో అడుగిడే మహిళల సంఖ్య మరింత తక్కువ.
Similar News
News March 12, 2026
మధురవాడ: ఉరివేసుకుని యువకుడు మృతి!

మధురవాడ గణేష్ నగర్‌లో తాడి ప్రవీణ్ కుమార్ (27) అనే యువకుడు మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చింతపల్లికి చెందిన ప్రవీణ్ గత ఆరేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తూ, స్థానిక టెలిఫోన్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 12, 2026
విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చర్లపల్లికి కొత్త సూపర్ ఫాస్ట్ రైలు!

రైల్వే ఆధునీకరణలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. కొక్రాఝర్ – చర్లపల్లి (05674) స్పెషల్ రైలు శనివారం సాయంత్రం పెందుర్తి (17:58), దువ్వాడ (19:30) స్టేషన్లకు చేరుకుంటుంది. 20 కోచ్‌లతో నడిచే ఈ అత్యాధునిక రైలు సామాన్య ప్రయాణికులకు హైదరాబాద్ వెళ్లేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది
News March 12, 2026
విశాఖ జిల్లాలో టెన్త్ పరీక్షలకు అంతా రెడీ

ఈ నెల 16వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు విశాఖ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 133 పరీక్షా కేంద్రాల్లో 28,983 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 456 స్కూల్స్ నుంచి విద్యార్థులు హాజరవుతున్నారు. 8 స్కూల్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్స్ స్క్వాడ్స్ పర్యవేక్షణ చేయనున్నాయి.


