News May 1, 2024

విశాఖ ఎంపీ స్థానానికి మూడు ఈవీఎంలు

image

విశాఖ లోక్‌సభ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారు. 2019 ఎన్నికల్లో కేవలం 14 మంది పోటీ చేశారు. 39 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఆరుగురివి తిరస్కరణకు గురయ్యాయి. 33 మంది మిగలగా, ఒక్కరూ ఉపసంహరించుకోలేదు. నోటాతో కలిపితే 34 మందితో బ్యాలెట్ పేపరు రానుంది. ఒక బ్యాలెట్ యూనిట్(ఈవీఎం)లో 16 పేర్లకు మాత్రమే అవకాశం ఉంది. ఈ లెక్కన 34 పేర్లకు 3 ఈవీఎంలు వినియోగించాల్సి ఉంది.

Similar News

News August 5, 2025

పారా అథ్లెటిక్స్‌లో సత్తా చాటాలి: కలెక్టర్

image

విశాఖ వేదికగా పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్‌లో ఆగష్టు 9న రాష్ట్ర స్థాయి 6వ జూనియర్, సబ్-జూనియర్ పారా అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పోటీల గోడ పత్రికను కలెక్టర్ హరీంద్రప్రసాద్ ఆవిష్కరించారు. విశాఖ వేదికగా జరిగే ఈ పోటీలకు అన్ని జిల్లాల నుంచి పారా క్రీడాకారులు రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అవ్వాలని ఆకాంక్షించారు.

News August 5, 2025

ఓటింగ్‌పై జీవీఎంసీ కార్పొరేటర్లకు అవగాహన

image

జీవీఎంసీలో బుధవారం జరుగనున్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ ఓటింగ్ విధానంపై కార్పొరేటర్లకు GVMC అదనపు కమిషనర్ రమణమూర్తి మంగళవారం అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందు ఓటర్ ఐడెంటిఫికేషన్ ఐడి కార్డును చూపించి లోపలకి వెళ్లాలన్నారు. ఒక ఓటరు 10ఓట్లు మాత్రమే వేయాలని, అంతకన్నా ఎక్కువ వేస్తే బ్యాలెట్ చెల్లదన్నారు.

News August 5, 2025

విశాఖ: రోడ్డు దాటుతున్న యువకుడిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రౌండ్ సర్కిల్ వద్ద రోడ్డుపై నడుస్తున్న యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నాలుగో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.