News February 14, 2026
రైతులకు అలర్ట్.. ఖమ్మం మార్కెట్‌కు సెలవు లేదు

ఖమ్మం జిల్లాలోని మిర్చి రైతులకు మార్కెట్ కమిటీ అధికారులు కీలక సమాచారం అందించారు. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాధారణంగా సెలవు ఉంటుందని భావించే రైతులు అయోమయానికి గురికావద్దని, మార్కెట్ పనిచేస్తుందని తెలిపారు. రైతులు తమ మిర్చి పంటను నాణ్యతా ప్రమాణాల ప్రకారం మార్కెట్‌కు తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని అధికారులు సూచించారు.
Similar News
News April 19, 2026
MBNR: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజల విలవిల

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.4, గండీడ్ మండలం సల్కర్ పేట 43.3, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 43.2, అడ్డాకుల 43.0, కోయిలకొండ మండలం పారుపల్లి 42.9, కౌకుంట్ల 42.7, మహబూబ్ నగర్ అర్బన్ 42.6, దేవరకద్ర 42.5 ఉష్ణోగ్రత నమోదయింది.
News April 19, 2026
ప్రత్యేక శిక్షణతో వినికిడి సమస్యకు చెక్.!

‘శ్రవణం ప్రాజెక్ట్’లో టీచింగ్‌కు స్పెషల్ B.ED చేసిన వారే అర్హులు. వీరు స్పీచ్ థెరపీని ప్రత్యేక విధానం ద్వారా బోధిస్తారు. నిత్యం వాడే వస్తువుల నుంచి ఒక్కో పదం గట్టిగ చెప్తూ, పిల్లల చేతికి వస్తువులను ఇచ్చి ఒక్కో పదంగా వారి నోటి వెంట వచ్చేలా చేస్తారు. డ్రాయింగ్, గేమ్స్, ఇతర అంశాలపై పిల్లలతోపాటు తల్లిదండ్రులకు సైతం శిక్షణ ఇస్తారు. ఇలా ఎంతో ఖర్చుతో కూడుతున్న ఈ వ్యవహారాన్ని TTD ఉచితంగా అందస్తోంది.
News April 19, 2026
MBNR: ప్రముఖ కవి కమలేకర్ దాగోజీరావు కన్నుమూత

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, పండితులు ఆచార్య కమలేకర్ దాగోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. భగీరథ కాలనీలోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. నేటి సాయంత్రం 4 గంటలకు వీరన్నపేట శివాలయం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల సాహితీలోకం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.


