News February 14, 2026
NGKL: మున్సిపాలిటీలో కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 6

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికలలో స్థానిక ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 24 వార్డులకు గాను 18 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం 6 స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పట్టుదలతో పనిచేసి మున్సిపల్ ఎన్నికలలో పై చేయి సాధించి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
Similar News
News April 17, 2026
3,106 చెరువుల్లో ఉపాధి పనులు: చిత్తూరు కలెక్టర్

‘జలధార-నీటి భద్రత’ పనులతో చిత్తూరు జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. 3,106 చెరువుల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని సూచించారు. నీటి నిల్వలు పెంపు, సాగునీటి బలోపేతం, కరవు నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్‌కు 3 చెరువులు కేటాయించి, అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.
News April 17, 2026
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: SP సుబ్బరాయుడు

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలని తిరుపతి SP సుబ్బరాయుడు సూచించారు. గురువారం SP కార్యాలయం నుంచి బ్యాంకర్లు, పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులను నమ్మవద్దని కోరారు. OTP, పిన్ నంబర్లు, బ్యాంక్ వివరాల వంటి గోప్య సమాచారాన్ని ఎవరికీ చెప్పవద్దని సూచించారు.
News April 17, 2026
సౌందర్య.. అచ్చ తెలుగు ఆడపడుచులా!

టాలీవుడ్‌లో మహానటి సావిత్రి తర్వాత అంతటి అభిమానం పొందిన హీరోయిన్లలో సౌందర్య ఒకరు. ‘మనవరాలి పెళ్లి’తో 1993లో తెలుగు సినిమాల్లోకి వచ్చి పదేళ్లు సినీరంగాన్ని ఏలారు. 100కుపైగా మూవీస్‌లో నటించారు. అసభ్య వస్త్రధారణకు దూరంగా నిండైన చీరకట్టుతో అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించేవారు. కానీ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. నేడు సౌందర్య వర్ధంతి.


