News February 14, 2026

NGKL: మున్సిపాలిటీలో కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 6

image

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికలలో స్థానిక ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 24 వార్డులకు గాను 18 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం 6 స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పట్టుదలతో పనిచేసి మున్సిపల్ ఎన్నికలలో పై చేయి సాధించి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

Similar News

News April 17, 2026

ఆదోని మార్కెట్‌లో పత్తి ధర రూ.8,939

image

ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.8,939 పలికింది. వేరుశనగ రూ.7,729, ఆముదాలకు రూ.6,076 ధర దక్కింది. సీసీఐ కేంద్రాలు మూతపడటంతో పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. అయితే మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే జాతీయ మార్కెట్ అని, కనీస సౌకర్యాలు లేవని వారు మండిపడుతున్నారు.

News April 17, 2026

ATP: రక్తదానం చేస్తే రూ.3 లక్షల బీమా

image

సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 20న కళ్యాణదుర్గం ప్రజావేదికలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ నేత దేవినేని ధర్మతేజ తెలిపారు. కంబదూరు మండలం ములకనూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రక్తదానం చేసే వారికి రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.