News February 14, 2026
NGKL: మున్సిపాలిటీలో కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 6

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికలలో స్థానిక ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 24 వార్డులకు గాను 18 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం 6 స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పట్టుదలతో పనిచేసి మున్సిపల్ ఎన్నికలలో పై చేయి సాధించి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
Similar News
News April 18, 2026
ఎల్లారెడ్డిపేట: ఎనిమిది రోజులు గడిచినా.. చిక్కని ‘ఏటీఎం’ దొంగలు!

ఎల్లారెడ్డిపేటలో ఎస్‌బీఐ ఏటీఎంను ఎత్తుకెళ్లిన ఘటన జరిగి ఎనిమిది రోజులు గడుస్తున్నా.. దొంగల ఆచూకీ మాత్రం మిస్టరీగానే మారింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు పది బృందాలుగా విడిపోయి విస్తృతంగా గాలిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ పుటేజీలన్నింటినీ జల్లెడ పడుతున్నా, ఈ దుశ్చర్యకు పాల్పడింది ఏ రాష్ట్రానికి చెందిన ముఠా అనే విషయంలో స్పష్టత రాలేదు.
News April 18, 2026
HYD: అత్తాపూర్ RDOకు నెలరోజుల జైలు

రాజేంద్రనగర్ మం. అత్తాపూర్ RDOకు కోర్టు ధిక్కరణ కింద నెల రోజుల జైలు, రూ.2వేల జరిమానా విధించింది. పెద్ద షాపూర్‌లోని 74 ఎకరాల భూ వివాదంలో ఉత్తర్వూలు జారీ చేయడంలేదని యూసుఫుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు.. సూచించిన టైమ్‌కి ఉత్తర్వూలు జారీ చేయలేదని తీర్పునిచ్చింది. జరిమానా చెల్లించకుంటే 2వారాలు శిక్ష పొడిగించాలంది. ఆప్పీల్‌కు వీలుగా తీర్పు అమలను 2వారాలు నిలిపేసింది.
News April 18, 2026
నటిపై పరువు నష్టం దావా వేసిన చాహల్

తన పరువుకు భంగం కలిగించేలా SMలో పోస్ట్‌లు, మీడియా ముందు మాట్లాడినందుకు నటి తానియా <<19636894>>ఛటర్జీపై<<>> టీమిండియా క్రికెటర్ చాహల్ సీరియస్ అయ్యారు. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తూ.. వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఆమెపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై తానియా స్పందిస్తూ.. ‘ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇది ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు. దీనివల్ల నేనే ట్రోలింగ్‌కు గురయ్యా’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


