News February 14, 2026
సిద్దిపేట: రాష్ట్ర స్థాయికి అపూర్వ ఎంపిక

సిద్దిపేట జిల్లా స్థాయి CM CUP వాలీబాల్ పోటీల్లో రాంసాగర్ జడ్పీ హైస్కూల్ విద్యార్థిని CH. అపూర్వ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈ నెల 21 నుండి 23 వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలో జరగనున్న పోటీల్లో ఆమె జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. అపూర్వను పాఠశాల హెచ్‌ఎం జి. రాజ్‌కుమార్, పీఈటీ ఎండీ. అనీఫ్ అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Similar News
News April 19, 2026
గ్రేటర్ జోన్‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్

గ్రేటర్ జోన్‌లో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. గత రెండు రోజులుగా అత్యధికంగా 99 నుంచి 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా వేసవి తీవ్రత పెరిగే మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది.

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ 20% నీటిని ఆదా చేయాలి

వేసవి దృష్ట్యా వచ్చే 45 రోజులు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ 20 శాతం నీటిని ఆదా చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కోరారు. నగరంలో నీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగిందని, సరఫరా 52 వేల నుంచి లక్షా 8 వేలకు చేరిందన్నారు. కేవలం 20 శాతం ప్రాంతాల్లోనే అధిక డిమాండ్ ఉందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.