News February 14, 2026
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో హంగ్

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. దేవరకద్ర మున్సిపాలిటీలో మొత్తం12వార్డులకు గాను కాంగ్రెస్6, బీఆర్ఎస్5, బీజేపీ1, ఇండిపెండెంట్ 1 స్థానం గెలుచుకుంది. అల్లంపూర్ మున్సిపాలిటీలో మొత్తం 10వార్డులుంటే అధికార కాంగ్రెస్5, బీఆర్ఎస్ 5 గెలుచుకున్నాయి. ఇలా ఇరు పార్టీలు చెరి సమానం వార్డులు పంచుకోవడంతో రెండు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.
Similar News
News April 18, 2026
భూములిచ్చే రైతులకు ఎకరాకు ₹40 వేల కౌలు: CBN

AP: రాజధాని రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చే రైతులకు ఎకరానికి ₹40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని CM చంద్రబాబు తెలిపారు. ఏడాదికి ₹3 వేల చొప్పున కౌలు పెంచుతామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ₹1.50 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీ చేస్తామని వివరించారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.
News April 18, 2026
జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్

తూప్రాన్ ఐవోసీ భవనంలో శుక్రవారం జనగణనపై అదనపు కలెక్టర్ నగేశ్ సమీక్ష నిర్వహించారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రక్రియకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బ్లాకులుగా విభజించి పకడ్బందీగా గణన చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో జయచంద్ర రెడ్డి, MRO చంద్రశేఖర్ రెడ్డి, MPDO సతీశ్ పాల్గొన్నారు. గణన సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News April 18, 2026
2028లోనే TG అసెంబ్లీ ఎన్నికలు?

పునర్విభజనతో ముడిపడిన మహిళా రిజర్వేషన్ బిల్లు నిన్న LSలో వీగిపోవడంతో కేంద్రం 2029లో చేపట్టాలనుకున్న జమిలి ఎన్నికలూ అసాధ్యమేనని రాజకీయ వర్గాలంటున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, తర్వాత జమిలికి వెళ్లాలని మోదీ ప్రభుత్వం భావించిందని చెబుతున్నారు. కానీ డీలిమిటేషన్ కుదరకపోవడంతో దీనికి వెళ్లకపోవచ్చని అంటున్నారు. అలా అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు యథాతథంగా 2028లోనే జరగనున్నాయి.


