News May 1, 2024

పెందుర్తిలో పవన్.. పాయకరావుపేటలో జగన్

image

ఉమ్మడి విశాఖలో నేడు జనసేన, వైసీపీ అధినేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు పెందుర్తి నాలుగు రోడ్ల కూడలిలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. సీఎం జగన్ పాయకరావుపేటలోని సూర్యా మహాల్ సెంటర్‌లో సాయంత్రం 3 గంటలకు జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పొలిటికల్ హీట్ నెలకొంది. ఈ నేపథ్యంలో జనసమీకరణపై ఆయా పార్టీల నాయకులు దృష్టి పెట్టారు.

Similar News

News August 6, 2025

విశాఖ: నేడే ఎన్నిక.. బరిలో 20 మంది

image

ఈరోజు ఉ.10 గంటలకు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు మొదలవ్వనున్నాయి. మొత్తం 97మంది <<17313160>>కార్పొరేటర్లు<<>> ఉండగా.. కూటమి తరుఫున 10 మంది, వైసీపీ తరఫున 10మంది పోటీలో ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉంది. జనసేనలో ఒకరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ఎన్నికకు తాను దూరంగా ఉన్నట్లు ఆ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రకటించారు. మరో కార్పొరేటర్ బి.గంగారావు కూడా ఓటింగ్‌లో పాల్గొనరని సమాచారం.

News August 6, 2025

ఏయూ: క్వాంటం కంప్యూటింగ్‌పై ఎఫ్‌డిపి శిక్షణ

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో క్వాంటం కంప్యూటింగ్‌పై వారం రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను AU వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ మంగళవారం విడుదల చేశారు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 తేదీ వరకు క్వాంటం కంప్యూటింగ్ ఇన్సైట్స్ ఫర్ అకడమీషన్స్-కాన్సెప్ట్, అప్లికేషన్స్ అండ్ టూల్స్ అనే అంశంపై ఎఫ్.డి.పి నిర్వహించనున్నారు.

News August 5, 2025

విశాఖ సిటీ పోలీసులకు వార్షిక వైద్య పరీక్షలు

image

విశాఖ సీపీ డా.శంఖబ్రత బాగ్చి చొరవతో కేజీహెచ్, ఏఎంసీ సహకారంతో సిటీ పోలీసులకు యాన్యువల్ హెల్త్ చెకప్ మంగళవారం ప్రారంభమైంది. సుమారు 2700 మంది సిబ్బందికి ఈ నెలాఖరులోగా పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి రోజున 150 మంది సిబ్బంది పాల్గొన్నారు. 2024లో ప్రారంభించిన కార్యక్రమం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే గుర్తించగలిగామని, ఈసారి మరిన్ని పరీక్షలు చేస్తామని సీపీ పేర్కొన్నారు.