News February 14, 2026
జగిత్యాల: పార్టీ నిరాకరించినా.. ప్రజలు మాత్రం ప్రజా సేవకులకే పట్టం

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో 22వ వార్డు బీజేపీ టికెట్ ఆశించిన ఆరవ లక్ష్మి (బిట్టు), 26వ వార్డు బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ పులి రమ (శ్రీధర్) టికెట్ దక్కక ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఘన విజయం సాధించారు. బీజేపీ టికెట్‌ను వేరే వారికి కేటాయించడంతో వీరి కుమారులు కన్నీరు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పార్టీ నిరాకరించినా ప్రజలు మాత్రం ప్రజా సేవకులను ఆదరిస్తారు అనే దానికి ఇదే నిర్వచనం.
Similar News
News April 17, 2026
భద్రతగా చేరడమే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యం: కలెక్టర్

రహదారి ప్రయాణాల్లో ప్రతి ప్రాణం విలువైనదని, సురక్షితంగా గమ్యం చేరడమే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. జిల్లాలో 45 బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టామన్నారు. 2023 నుంచి ఇప్పటివరకు వందలాది మంది ప్రమాదాల్లో మరణించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంపై గ్రామాల్లో తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు.
News April 17, 2026
టీనేజ్ ప్రెగ్నెన్సీ అనర్థాలపై అవగాహన అవసరం: కలెక్టర్

పార్వతీపురం కలెక్టరేట్‌లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ వలన కలిగే అనర్థాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొని కౌమార దశలో గర్భధారణ – దుష్ప్రభావాలపై పోస్టర్లను విడుదల చేశారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం, గర్భం దాల్చడం వంటి విషయాలపై యువతకు అవగాహన తప్పనిసరని, ఇలాంటి విషయాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలన్నారు.
News April 17, 2026
రోడ్డు భద్రతతోనే ప్రాణాలకు రక్షణ: ఎస్పీ నరసింహ

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఎస్పీ కె. నరసింహ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది జిల్లాలో 600 ప్రమాదాలు జరిగి, 230 మంది మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, క్షతగాత్రులను ఆదుకునే ‘రహదారి హీరోల’ను ప్రోత్సహిస్తామని చెప్పారు.


