News February 14, 2026

జగిత్యాల: పార్టీ నిరాకరించినా.. ప్రజలు మాత్రం ప్రజా సేవకులకే పట్టం

image

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో 22వ వార్డు బీజేపీ టికెట్ ఆశించిన ఆరవ లక్ష్మి (బిట్టు), 26వ వార్డు బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ పులి రమ (శ్రీధర్) టికెట్ దక్కక ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఘన విజయం సాధించారు. బీజేపీ టికెట్‌ను వేరే వారికి కేటాయించడంతో వీరి కుమారులు కన్నీరు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పార్టీ నిరాకరించినా ప్రజలు మాత్రం ప్రజా సేవకులను ఆదరిస్తారు అనే దానికి ఇదే నిర్వచనం.

Similar News

News April 18, 2026

భూగర్భ జలాల పెంచడమే లక్ష్యం: కలెక్టర్

image

భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యమని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. శనివారం కోడుమూరు మండలం ఆమడగుంట్లలో నీటి భద్రత, జల ధార జల హారతి కార్యక్రమం నిర్వహించారు. వంకలను, వాగులను, చెరువులను గుర్తించి వాటికి మరమ్మత్ పనులు చేపట్టి నీరు నింపుతామన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. నీటిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.

News April 18, 2026

జగిత్యాల జిల్లాలో రేపు ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

image

తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష (TSMS) 2026-27ను జిల్లాలో రేపు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. మొత్తం 2,972 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

News April 18, 2026

అప్పుడు మహిళలే బిల్లును వ్యతిరేకించారు.. ఎందుకంటే?

image

మహిళా రిజర్వేషన్లు బిల్లును ఒకప్పుడు మహిళలే వ్యతిరేకించారని తెలుసా? రాజ్యాంగ సభలో భాగమైన రేణుకా రే సహా పలువురు మహిళలు రిజర్వేషన్ వద్దనే వాదనను బలంగా వినిపించారు. అలా చేస్తే మహిళా ప్రాతినిధ్యం కొన్ని సీట్లకే పరిమితం అవుతుందని, జనరల్ సీట్లలో ప్రాధాన్యం తగ్గుతుందని 1947 జులై 18న జరిగిన సభలో పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత కాలంలో నెలకొన్న పరిస్థితులు వారి అంచనాలకు భిన్నంగా మారాయి.