News February 14, 2026
కామారెడ్డి: ఎమ్మెల్యేల హవా.. రెండు చోట్లా పీఠాలు సొంతం!

కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పట్టును నిరూపించుకున్నారు. బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మదన్ మోహన్ రావులు పీఠాలను దక్కించుకుని రాజకీయంగా తమ ఆధిక్యాన్ని చాటారు. ప్రజలు తమ అభివృద్ధి పనులకు పట్టం కట్టారని, మున్సిపాలిటీల ప్రగతికి మరింత కృషి చేస్తామని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
Similar News
News April 17, 2026
కర్నూలులో నేడే ఉద్యోగ మేళా

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. PhonePe, టాటా ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ చిట్స్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ Ltd సంస్థలు పాల్గొని 190 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన 18-30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దీప్తి తెలిపారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు.
News April 17, 2026
పడిపోయిన బొప్పాయి ధరలు

AP: యుద్ధం వల్ల అరబ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంలో బొప్పాయి ధరలు పడిపోయాయి. 2 వారాల కిందట టన్నుకు రూ.13 వేల వరకు ఉన్న ధర ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. ఇప్పటికే అకాల వర్షాలు, వైరస్, తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 30-40 టన్నులు రావాల్సి ఉండగా 10-15 టన్నుల పంటే చేతికి వచ్చింది. అటు దిగుబడి, ఇటు రేటు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తోటల్లోనే కాయలు పండిపోతున్నాయి.
News April 17, 2026
ఎల్కతుర్తి ఎస్‌ఐ ఏఆర్‌కు అటాచ్

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. విచారణ నివేదిక ఆధారంగా ఆయన్ను ఏఆర్‌కు అటాచ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యతో పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఇద్దరి ఎస్సైలపై వేటు వేసిన విషయం తెలిసిందే.


