News May 1, 2024

అత్యంత ప్రమాదకరంగా ఇంగ్లండ్ జట్టు

image

టీ20 వరల్డ్ కప్‌నకు పోటీ పడే జట్లలో ఇంగ్లండ్ టీమ్ భీకరంగా కనిపిస్తోంది. తుది జట్టులో 11మందిని చూస్తే.. బట్లర్, సాల్ట్, విల్ జాక్స్, బెయిర్‌స్టో, బ్రూక్, లివింగ్‌స్టన్, మొయిన్ అలీ, కరన్, ఆర్చర్, రషీద్, రీస్ టాప్లే ఉన్నారు. 10వ స్థానం వరకు బ్యాటింగ్ ఉండటం, ప్రతి ఆటగాడూ విధ్వంసకరంగా ఆడగలగడం ఈ టీమ్ ప్రత్యేకత. పేపర్‌పై బలంగా కనిపిస్తున్న ఈ ఇంగ్లండ్ జట్టు గ్రౌండ్‌లో ఎలా ఆడుతుందో చూడాలి.

Similar News

News January 1, 2025

తగ్గిన సిలిండర్ ధర

image

కొత్త ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. రూ.14.50 తగ్గడంతో ఢిల్లీలో గ్యాస్ ధర రూ.1804కు చేరింది. ప్రస్తుతం HYDలో సిలిండర్ ధర రూ.2014గా ఉంది. ఇవాళ్టి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతినెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తాయి.

News January 1, 2025

2025లో ప్రపంచయుద్ధం?

image

నోస్ట్రడామస్, బాబా వంగా ఇద్దరూ ఎన్నో ఏళ్ల ముందుగానే పలు ఘటనల్ని కచ్చితత్వంతో అంచనా వేశారు. 2025 గురించి వీరు చెప్పిన జోస్యం పాశ్చాత్య దేశాల ప్రజల్ని భయపెడుతోంది. ఈ ఏడాది ఐరోపాలో ప్రపంచయుద్ధం స్థాయిలో పరిస్థితులు నెలకొంటాయని వారు చెప్పారు. బ్రిటన్‌లో మహమ్మారి తిరిగి వస్తుందని, USలో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని అన్నారు. ప్రపంచ ఆధిపత్యం తూర్పుదేశాల చేతికి వస్తుందని జోస్యం చెప్పారు.

News January 1, 2025

త్వరలోనే కత్తిపూడి-ఒంగోలు హైవే విస్తరణ

image

AP: కోస్తా తీరంలో కీలకమైన కత్తిపూడి-ఒంగోలు హైవే విస్తరణకు అడుగులు పడుతున్నాయి. దీనిని 4, 6 వరుసలుగా విస్తరించేందుకు DPR తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం ఈ రోడ్డు 2 వరుసలుగా ఉంది. 390KM ఉండే ఈ రహదారిలో తొలుత కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు, రెండో దశలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు విస్తరణ పనులు చేపడతారు. అలాగే ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు 40కి.మీ విస్తరణ కూడా జరగనుంది.