News February 14, 2026
కామారెడ్డి: ఎమ్మెల్యేల హవా.. రెండు చోట్లా పీఠాలు సొంతం!

కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పట్టును నిరూపించుకున్నారు. బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మదన్ మోహన్ రావులు పీఠాలను దక్కించుకుని రాజకీయంగా తమ ఆధిక్యాన్ని చాటారు. ప్రజలు తమ అభివృద్ధి పనులకు పట్టం కట్టారని, మున్సిపాలిటీల ప్రగతికి మరింత కృషి చేస్తామని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
Similar News
News April 19, 2026
నేడే అక్షయ తృతీయ.. బంగారం ధర ఎంతంటే?

ఇవాళ అక్షయ తృతీయ కావడంతో చిన్న బంగారు వస్తువైనా కొని ఇంటికి తెస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని చాలామంది నమ్మకం. అయితే పసిడి ధరలు రికార్డు స్థాయిలో ఉండటం కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తోంది. కాగా నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,55,780 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,800కు విక్రయిస్తున్నారు.
News April 19, 2026
KMR: పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి

దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 2 వేల CSR పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ సౌకర్యం కల్పిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 10, ఇంటర్, డిగ్రీ, బీఫార్మసీ, బీటెక్, పాలిటెక్నిక్, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల GM లాలూ నాయక్ తెలిపారు. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకంలో భాగంగా విద్యార్థులు అనుభవం పొందేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందన్నారు.
News April 19, 2026
‘లెనిన్’లో నాగ్ మార్పులు?

మురళీ కిశోర్ డైరెక్షన్‌లో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘లెనిన్’ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన నాగార్జున కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. దీంతో మూవీని ట్రిమ్ చేసే పనిలో ఎడిటర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన <<19666338>>‘యెట్టా యెట్టా’<<>> పాట ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.


