News February 14, 2026
ఈ ఫలితాలు ప్రజల విశ్వాసాన్ని చాటాయి: ఖర్గే

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు పార్టీపై ప్రజల విశ్వాసాన్ని చాటాయని పేర్కొన్నారు. 3.8 కోట్ల ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారిత, నిరంతర పురోగతి అందిస్తూ ‘ప్రజా తెలంగాణ’కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్ కాసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు.
Similar News
News April 18, 2026
ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు.. ప్రతిపక్షాలపై పవన్ విమర్శలు

LSలో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి చట్టసభల్లో మహిళా శక్తిని పెంపొందించే అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దూరం చేశాయని AP Dy.CM పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ బిల్లును LS ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను జనసేన స్వాగతించినట్టు చెప్పారు. అయితే ప్రతిపక్షాలు కూడా ఆమోదించి ఉంటే వారికీ గౌరవం దక్కేదన్నారు. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్టసభల్లో సముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News April 18, 2026
సర్వీస్ ఇనామ్ భూములకు విముక్తి

AP: గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములు కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ భూములకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించింది. రాష్ట్రంలో 1,36,024 ఎకరాలను ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తీసుకొస్తున్నామని, నిషేధ జాబితా 22(A) నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో వీటి క్రయ, విక్రయాలకు, రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించనుంది. అవి పట్టా భూములుగా రికార్డుల్లో ఉంటాయి.
News April 18, 2026
భూములిచ్చే రైతులకు ఎకరాకు ₹40 వేల కౌలు: CBN

AP: రాజధాని రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చే రైతులకు ఎకరానికి ₹40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని CM చంద్రబాబు తెలిపారు. ఏడాదికి ₹3 వేల చొప్పున కౌలు పెంచుతామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ₹1.50 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీ చేస్తామని వివరించారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.


