News February 14, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Similar News
News April 18, 2026
NZB: జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు

నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని రెండేళ్ల కాల పరిమితికి ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా ఉన్న కమిటీలో సభ్యులుగా జి.సాయి ప్రసాద్, బాల కుమార్, నర్సింహులు, భూపతి, రామదయానంద్, మహ్మద్ గౌస్, శ్రీనివాస్, శ్రీకాంత్, మాజిద్, జాన్సన్‌లను నియమించారు.
News April 18, 2026
‘వారణాసి’పై ఎండల ఎఫెక్ట్!

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘వారణాసి’ కీలక షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ నేతృత్వంలో మహేశ్‌పై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే మూవీ యూనిట్ మే నెలలో సమ్మర్ బ్రేక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహేశ్, జక్కన్న తమ ఫ్యామిలీలతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారట. ఆ తర్వాత జూన్ నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు సమాచారం.
News April 17, 2026
LNG ఇంపోర్ట్స్.. భారత్‌కు ఇక బోలెడన్ని ప్రత్యామ్నాయాలు!

LNG కోసం ఇప్పటివరకు ఎక్కువగా ఖతర్‌పైన ఆధారపడిన భారత్ పశ్చిమాసియా యుద్ధ పరిణామాలతో కొత్త సోర్సులను కనెక్ట్ చేసుకుంది. ఏడేళ్ల గ్యాప్ తర్వాత నార్వే నుంచి, రెండేళ్ల విరామం తర్వాత రష్యా నుంచి భారత్‌కు త్వరలో LNG కార్గోలు రానున్నట్లు సమాచారం. ఇక ఆఫ్రికా దేశాల నుంచి 1.2 మిలియన్ టన్నుల LNGకి భారత్ ఆర్డర్ చేసింది. ఇందులో ఆరు నౌకలు గత నెల భారత్ చేరుకోగా మరో 7,54,000 టన్నుల LNG ఈనెలాఖరుకు రానుంది.


