News February 14, 2026

ఎమ్మెల్యే ఇకనైనా తమకు స్వేచ్ఛ కల్పిస్తారా, లేదా: జీవన్ రెడ్డి

image

ఎమ్మెల్యే ఇకనైనా తమకు స్వేచ్ఛ కల్పిస్తారా.. లేదా.. అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నేడు గెలిచిన అభ్యర్థులను ఎమ్మెల్యే లోబరుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, ఎమ్మెల్యే నుంచి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్వేచ్ఛ ప్రసాదించండి అని అధిష్టానాన్ని కోరారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పతనానికి ఎమ్మెల్యే సంజయ్ కారణమయ్యారని మండిపడ్డారు.

Similar News

News April 18, 2026

శాంతిపురంలో అక్రమ క్వారీ సీజ్..!

image

కుప్పం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌పై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. శాంతిపురం (M) రాళ్ల బూదుగూరు సమీపంలోని సోలిశెట్టిపల్లి వద్ద అక్రమంగా నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీపై వేకువ జామున కుప్పం DSP పార్థసారథి ఆకస్మిక దాడులు నిర్వహించి క్వారీ సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్వారీలోని హిటాచి వాహనంతో పాటు రెండు కంప్రెషర్లు సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 18, 2026

విశాఖ: బైక్ ఢీకొని వృద్ధుడి మృతి

image

విశాఖ పోర్ట్ ట్రక్ పార్కింగ్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా బైకు ఢీకొని సింహాద్రి(58) అనే వృద్ధుడు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ పార్కింగ్‌లో ఉన్న డ్రైవర్లు 108కి ఫోన్ చేసి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా నిర్ధారించారు. హార్బర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతనిని అక్కడే పనిచేసే లారీ క్లీరన్‌గా గుర్తించారు. మృత దేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.

News April 18, 2026

నేడు హనుమకొండ ఐటీఐలో జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో హనుమకొండలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో 6 కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్ వంటి పలు విభాగాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.