News February 14, 2026

కాగజ్‌నగర్‌లో ఓటర్ల విలక్షణ తీర్పు..!

image

కాగజ్‌నగర్ బల్దియా ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. ఇక్కడ పోటీ చేసిన 3 ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కదానికి మ్యాజిక్ ఫిగర్ ఫలితాలు ఇవ్వలేదు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 9, BRS 11, BJP 05, AI MIM 01, ఇండిపెండెంట్ లు 03 గెలిచారు.

Similar News

News April 17, 2026

కమిన్స్ ఎప్పటి నుంచి ఆడతారంటే?

image

IPL: SRH కెప్టెన్ పాట్ కమిన్స్ నేడు ఆ జట్టు క్యాంపులో చేరనున్నారని క్రీడావర్గాలు తెలిపాయి. అయితే రేపు చెన్నైతో జరిగే మ్యాచులో అతడు ఆడే అవకాశం లేదని పేర్కొన్నాయి. ఏప్రిల్ 25 నుంచి జరిగే మ్యాచులకు అందుబాటులో ఉండవచ్చని వెల్లడించాయి. కాగా కమిన్స్ రాకతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ దళం బలపడనుంది.

News April 17, 2026

భద్రతగా చేరడమే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యం: కలెక్టర్

image

రహదారి ప్రయాణాల్లో ప్రతి ప్రాణం విలువైనదని, సురక్షితంగా గమ్యం చేరడమే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. జిల్లాలో 45 బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టామన్నారు. 2023 నుంచి ఇప్పటివరకు వందలాది మంది ప్రమాదాల్లో మరణించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంపై గ్రామాల్లో తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు.

News April 17, 2026

టీనేజ్ ప్రెగ్నెన్సీ అనర్థాలపై అవగాహన అవసరం: కలెక్టర్

image

పార్వతీపురం కలెక్టరేట్‌లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ వలన కలిగే అనర్థాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొని కౌమార దశలో గర్భధారణ – దుష్ప్రభావాలపై పోస్టర్లను విడుదల చేశారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం, గర్భం దాల్చడం వంటి విషయాలపై యువతకు అవగాహన తప్పనిసరని, ఇలాంటి విషయాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలన్నారు.