News February 14, 2026
సిద్దిపేట: జాగ్రత్త.. బుట్టలో వేసి.. లక్షలు దోచేస్తున్నారు!

మ్యాట్రిమోనియల్ సైట్లు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీనివాసు హెచ్చరించారు. ప్రధానంగా NRI, పెద్ద వ్యాపారవేత్తలమని నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తున్నారని తెలిపారు. పరిచయం పెంచుకున్నాక అత్యవసరాలు, స్టాక్స్, ట్రేడింగ్‌లో భారీ లాభాలంటూ పెట్టుబడుల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారని వివరించారు.
Similar News
News February 16, 2026
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో SIకి గాయాలు

చౌటకూరు మండలం సరాప్ పల్లి గ్రామ శివారులో పోలీసు వాహనాన్ని వెనక వచ్చిన లారీ ఢీ కొట్టింది. వాహనంలో ఉన్న జోగిపేట ఎస్ఐ పాండుకు గాయాలయ్యాయి. జోగిపేట నుంచి సంగారెడ్డికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News February 16, 2026
పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 65 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News February 16, 2026
గుంటూరులో ఫలితాలలో షాక్.. D గ్రేడ్‌లో 2,123 మంది విద్యార్థులు

SSC 100 రోజుల యాక్షన్ ప్లాన్ సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 ఫలితాల్లో గుంటూరు జిల్లా మిశ్రమ ఫలితాలు సాధించింది. మొత్తం 10,332 మంది విద్యార్థుల్లో 568 మంది A గ్రేడ్, 2,239 మంది B గ్రేడ్, 4,912 మంది C గ్రేడ్ సాధించగా, 2,123 మంది D గ్రేడ్‌లో నిలిచారు. D గ్రేడ్ శాతం గణనీయంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యాశాఖ 46 పరీక్షల మూల్యాంకనం ద్వారా మెరుగుదలపై దృష్టి సారించింది.


