News May 1, 2024
కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు: సీఎంలు

తెలుగు రాష్ట్రాల సీఎంలు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ‘కార్మిక సోదరుల శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం ఎదుగుతోంది. సమాజహితమే పరమావధిగా కష్టించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘చెమట చుక్క.. కరిగిన కండరం.. శ్రమైక జీవన సౌందర్యం సకల తెలంగాణ ఆహార్యం. మేడే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు’ అని సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ పెట్టారు.
Similar News
News March 20, 2026
రూ.5.62 లక్షల కోట్లకు చేరువగా రుణభారం!

తెలంగాణలో అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంపై రుణభారం రూ.5.62 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2025-26లో రుణభారం రూ.5.03 లక్షల కోట్లు కాగా ఇప్పుడు అదనంగా మరో రూ.59,000 కోట్లు పెరగనుంది. రుణభారం ఈ విధంగా పెరగడం వల్ల, ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు సేకరించే విషయంలో ప్రభుత్వానికి ఆటంకాలు తప్పేలా లేవు.
News March 20, 2026
రేపు, ఎల్లుండి వర్షాలు: APSDMA

బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనంతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో శనివారం, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు అన్ని జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని తెలిపిింది.
News March 20, 2026
మేకలకు ‘వైడ్ యాంగిల్’.. గద్దలకు ‘బైనాక్యులర్’ విజన్!

జీవులన్నింటిలో మేకలు, గద్దలు విభిన్న దృష్టి సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. మేకలు తమ దీర్ఘచతురస్రాకార కనుపాపల ద్వారా తల తిప్పకుండానే 320 డిగ్రీల వరకు చూడగలవు. గడ్డి మేస్తున్నప్పుడు కూడా శత్రువులను పసిగట్టేలా ప్రకృతి వీటికి ఈ ‘వైడ్ యాంగిల్’ చూపును ఇచ్చింది. అలాగే గద్దలు కిలోమీటర్ల ఎత్తు నుంచి కూడా నేలపై చిన్న ఆహారాన్ని స్పష్టంగా చూస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో.


