News May 1, 2024

ఉద్యోగులకు నెల్లూరు కలెక్టర్ సూచనలు

image

ఈసీ మార్గదర్శకాల మేరకు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు వారి నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లోనే పోస్టల్‌బ్యాలెటు ఓట్లు వినియోగించుకోవాలని కలెక్టర్ హరి నారాయణన్‌ సూచించారు. మే 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్లమెంటుకు, అసెంబ్లీకి రెండు ఓట్లు వేసేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.

Similar News

News October 18, 2025

అధిష్ఠానం ముందుకు.. నెల్లూరు టీడీపీ నేతల వ్యవహారం!

image

నెల్లూరులో పెద్ద దుమారం రేపిన రేషన్ మాఫియా వ్యవహారం TDP అధిష్ఠానం వద్దకు చేరుకుంది. నెల్లూరులో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీలను ఇటీవల పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి ద్వజమెత్తిన విషయం తెలిసిందే. అదే పార్టీకి చెందిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి రేషన్ మాఫియా వెనుక ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నుడా చైర్మన్, మరో నేత విజయవాడకు వెళ్లినట్టు సమాచారం.

News October 18, 2025

నెల్లూరు: సా.. గుతున్న పెన్నా రివిట్మెంట్ వాల్ పనులు !

image

వరద ప్రవాహాల నుంచి పరివాహక ప్రాంతాలు ముంపునకు గురికాకుండా నగరంలోని పెన్నా నది భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో చేపడుతున్న రివిట్మెంట్ వాల్ కాలాతీతం అవుతుంది. ఇటీవల సోమశిల రిజర్వాయర్ నుంచి వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. కాగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పెన్నాకు వరద నీరు భారీగా చేరుతుంది. ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత ముప్పు తప్పుతుందని స్థానికులు పేర్కొన్నారు.

News October 18, 2025

రూ.1కే సిమ్.. రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా

image

BSNL కొత్త వినియోగదారులకు దీపావళి సందర్భంగా కానుక ప్రకటించినట్లు నెల్లూరు జిల్లా జనరల్ మేనేజర్ అమరేందర్ రెడ్డి తెలిపారు. ఈ ప్యాకేజీలో రూ.1కే సిమ్ అందిస్తూ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ సిమ్ కోసం ఆధార్ ధ్రువీకరణతో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం కానీ ఏజెంట్ల ద్వారా ఈ అవకాశం నవంబర్ 15 వరకు పొందవచ్చు అన్నారు.