News May 1, 2024
లింగాల: మహిళ హత్య కేసులో భర్తకు రిమాండ్

లింగాల మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన విజయ సోమవారం దారుణ హత్యకు గురైంది. అచ్చంపేట సీఐ రవీందర్ వివరాల ప్రకారం..విజయను తన భర్త చంద్రు గొంతు నులిమి చంపాడని, ఈ కేసులో అత్త లక్ష్మి, ఆడపడుచు బుజ్జి ప్రమేయం లేదన్నారు. చంద్రుని అరెస్టు చేసి అచ్చంపేట కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 18, 2026
MBNR: రేపే ఆఖరి తేదీ దరఖాస్తు చేసుకోండి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గ్రామీణ యువత స్వయం ఉపాధి కోసం SBI RSETY ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తోంది. రేపటి (19)వరకు సీసీటీవీ కెమెరా శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఉచిత భోజనం, వసతి కల్పించనున్నారు. 19 నుంచి 45 సం. వయస్సు గల పురుషులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బండమీదిపల్లిలోని RSETY కేంద్రంలో లేదా 9963369361, 9542430607 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
News January 17, 2026
పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✒రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం
✒MBNR: CM ఇలాకా.. BRSలో భారీగా చేరికలు
✒పాలమూరు జిల్లా అభివృద్ధి సీఎం బాధ్యత: డీకే అరుణ
✒వనపర్తి:భార్య చేతిలో భర్త దారుణ హత్య
✒రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించండి: సీఎం
✒సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన.. జర్నలిస్టులు ముందస్తు అరెస్ట్
✒పాలమూరులో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం:CM రేవంత్ రెడ్డి
News January 17, 2026
పాలమూరు జిల్లా అభివృద్ధి సీఎం బాధ్యత: డీకే అరుణ

పాలమూరు జిల్లా బిడ్డగా అభివృద్ధి చేయడం సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత అని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. గత సీఎంలు తమ జిల్లాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నారని, ఎక్కువ దృష్టి పెట్టి జిల్లాలో సస్యశాసమలంగా మార్చే బాధ్యత తనపై పూర్తిగా ఉందని సూచించారు. విద్య వైద్యం పై అధిక శ్రద్ధ చూపించి ఉపాధి కల్పన జిల్లాగా పేరు మార్చుకునేలా అభివృద్ధిలో దూసుకొని పోయేలా అడుగులు వేయాలన్నారు.


