News February 14, 2026
లవర్స్‌కు నెల్లూరు కలెక్టర్ సలహా ఇదే

నేటి యువత భవిష్యత్తులో స్థిరపడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే తమకు ఇష్టమైన జీవిత భాగస్వామిని ఎంచుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. <<19130524>>ప్రేమికుల రోజు<<>>ను పురస్కరించుకొని Way2Newsతో ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. యువత మొదట చదువు పూర్తి చేసి, మంచి ఉద్యోగం, ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని వివరించారు. #Valentine’s Day
Similar News
News February 15, 2026
దేశంలో ఎక్కడా లేదు.. శ్రీకాళహస్తిలోనే..!

శ్రీకాళహస్తి క్షేత్రంలో అనేక విశేషాలు మనకు కనిపిస్తాయి. ఆలయ ప్రధాన ముఖద్వారం, నందీశ్వరుడు, బలిపీఠంతో పాటు దారు ఏకశిలా ధ్వజస్తంభం ఉంటాయి. ధ్వజస్తంభం పైన చిన్న నంది ఉంటుంది. ఇటువంటి దారు ఏకశిలా ధ్వజస్తంభం భారతదేశంలో మరెక్కడా లేదు.
News February 15, 2026
నెల్లూరు: మల్లెపూలు కాదు.. తెల్లని బంగారమే!

నెల్లూరు జిల్లా కోట మండలంలో మల్లెపూల దిగుబడి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. తోటల నుంచి మొగ్గలు రావడం మొదలవ్వడంతో మార్కెట్‌లో కిలో మల్లెపూల ధర ఏకంగా రూ.1400 పలుకుతోంది. దిగుబడి స్వల్పంగా ఉన్నప్పటికీ, భారీ డిమాండ్ కారణంగా రైతులు వీటిని తిరుపతి, గూడూరు, చెన్నై ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో పంట లేకపోయినా, లభిస్తున్న అధిక ధరతో రైతులు అందినకాడికి విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు.
News February 15, 2026
నెల్లూరు: లేడీస్.. బీ అలర్ట్!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బంగారం ధర తులం రూ.1.60 లక్షలు దాటడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గత 6నెలల్లోనే 60కి పైగా స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఒంటరి మహిళలే లక్ష్యంగా నంబర్ ప్లేట్ లేని బైకులపై వచ్చి నగలు, తాలిబొట్లు లాకెళ్తున్నారు. తాజాగా గూడూరులో ఓ టీచర్‌పై బంగారం కోసం దాడి చేయడం కలకలం రేపింది. నగలు ధరించి బయటకు వెళ్లేటప్పుడు మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.


