News February 14, 2026

NZB: 18 నుంచి 14కు తగ్గిన MIM సీట్లు

image

2020లో నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో 18 సీట్లను గెలుచుకున్న AIMIM 2026 ఎన్నికల్లో 14 సీట్లను గెలుచుకుంది. AIMIM అభ్యర్థులు పోటీ చేసిన కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడమే దీనికి కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. గత పాలక వర్గంలో ఉన్న షకీల్ హైమద్, మహ్మద్ ఇద్రీస్ ఖాన్‌లు వరుసగా 52, 55వ డివిజన్లలో గెలుపొందడం గమనార్హం.

Similar News

News April 8, 2026

NZB: ప్రాణాలు తీస్తున్న వడ్ల కుప్పలు

image

బోధన్ మండలం పెగడపల్లి వద్ద రహదారిపై ఆరబెట్టిన వడ్ల కుప్పను ఢీకొని మూడు రోజుల కిందట గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందింది. రాత్రివేళ వడ్ల కుప్పలు కనిపించకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. అధికారులు కేవలం హెచ్చరికలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News April 8, 2026

NZB: ఆకతాయిలు.. అమ్మాయి వెంటపడితే అంతే

image

మహిళల భద్రత కోసం షీ టీమ్స్ నిఘా ముమ్మరం చేశాయి. ముఖ్యంగా NZB నగరంలోని ఖిల్లా ప్రభుత్వ కళాశాల, గిరిరాజ్ కాలేజీ వంటి విద్యాసంస్థలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక దృష్టి సారించారు. 3 నెలల్లో 150కి పైగా ఈవ్ టీజింగ్ కేసులు నమోదు కాగా, పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వేధింపులు ఎదురైతే వెంటనే 100 లేదా షీ టీమ్ ను సంప్రదించాలన్నారు.

News April 8, 2026

నిజామాబాద్: తైబజార్ వేలంలో కాసుల వర్షం

image

నిజామాబాద్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన తైబజార్ వేలం పాటలు ఈ ఏడాది భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. నవీపేట్, బోధన్, రుద్రూర్ వంటి ప్రాంతాల్లో భారీగా రూ.లక్షల్లో ధరలు పలికాయి. పెరిగిన పోటీతో స్థానిక సంస్థల ఖజానాకు భారీగా నిధులు సమకూరడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులను పట్టణ, గ్రామ అభివృద్ధి పనులకు వెచ్చించనున్నారు.