News February 14, 2026

తిరుమలగిరిలో తల్లీకొడుకుల విజయం

image

తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల్లో తల్లీకొడుకులు కౌన్సిలర్లుగా గెలిచి రికార్డు సృష్టించారు. అయితే వీరిద్దరూ వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి విజయం సాధించడం విశేషం. 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థినిగా తల్లి బత్తుల శకుంతల గెలవగా, 7వ వార్డు నుంచి కుమారుడు శీను కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. పార్టీలు వేరైనా, ఒకే ఇంట్లో ఇద్దరు విజేతలుగా నిలవడంతో స్థానికంగా ఈ విషయం ఆసక్తికర చర్చకు దారితీసింది.

Similar News

News February 20, 2026

పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ ఉదయం తగ్గిన బంగారం ధర సాయంత్రానికి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,57,370కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.800 ఎగబాకి రూ.1,44,250 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,70,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News February 20, 2026

ములుగు: ఇంటర్ పరీక్షలకు 10 సెంటర్లు

image

ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3,841 మంది విద్యార్థులు ఉండగా మొదటి సంవత్సరంలో 1,981 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,860 మంది విద్యార్థులు ఉన్నారు. అన్ని ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు ఇన్విటేషన్ సిబ్బంది, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు.

News February 20, 2026

NZB: నేషనల్ వాలీబాల్ పోటీలకు మనీష్ ఎంపిక

image

మోపాల్ మండలం కాంజర మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థి మనీష్ జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. 9వ తరగతి చదువుతున్న మనీష్, సబ్ జూనియర్ వాలీబాల్ (అండర్-16) విభాగంలో తన ప్రతిభ చాటి ఈ గౌరవం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ మురళి, పీఈటీ వినోద్ గర్వంగా ప్రకటించారు. మనీష్ సాధించిన ఈ విజయం పట్ల పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.