News May 1, 2024
సీఎం జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ

AP: CM జగన్‌కు PCC చీఫ్ వైఎస్ షర్మిల లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. ‘28 పథకాలను ఎందుకు నిలిపేశారు? SC, ST పునరావాసం, దళితులకు భూమి ఇచ్చే కార్యక్రమం ఎందుకు ఆగింది? SC, ST సబ్ ప్లాన్ నిధులు ఎందుకు దారి మళ్లించారు? విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరు ఎందుకు తీసేశారు?డ్రైవర్‌ను చంపిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? స్టడీసర్కిళ్లకు ఎందుకు నిధులు ఇవ్వలేదు? అని ఆమె నిలదీశారు.
Similar News
News March 21, 2026
ఎచ్చెర్ల: పరీక్షలు రాస్తారు.. ఫలితాలు మాత్రం ఎప్పటికో..!

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పరీక్షల ఫలితాలు విడుదలలో తీవ్ర జాప్యంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహణ తర్వాత కనీసం 30 నుంచి 45రోజుల వరకు ఫలితాలు వెల్లడికి పడుతోందని విద్యార్థులు వాపోతున్నారు. రీ వాల్యుయేషన్ ఫలితాలు రావడంలో, సర్టిఫికెట్స్ అందజేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో ఆందోళన చెందుతున్నామని అంటున్నారు.
News March 21, 2026
తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్

TG: ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రకారం తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.11,29,735తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2,3వ ప్లేస్‌లో HYD(రూ.4,76,679), సంగారెడ్డి(రూ.3,94,587) ఉన్నాయి. రూ.2,37,809 అత్యల్ప తలసరి ఆదాయంతో హనుమకొండ చివరి స్థానంలో ఉంది. కరవు ప్రాంతంగా ముద్రపడ్డ MBNR రూ.3,36,898తో ఆరో ప్లేస్‌కు చేరుకోవడం విశేషం. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ముందుండటం కొసమెరుపు.
News March 21, 2026
ధురంధర్-2 తెలుగు వెర్షన్ నేటి నుంచే..

ధురంధర్-2 తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజ్‌లు స్క్రీనింగ్ అవుతున్నాయి. కేవలం హిందీలోనే వచ్చిన పార్ట్-1 బ్లాక్‌బస్టర్ కావడంతో పార్ట్-2 గురించి తెలుగు ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా ధురంధర్-2ను తెలుగులోనూ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నెల 19న మూవీ రిలీజైనప్పటికీ సాంకేతిక కారణాల వల్ల తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాలేదు.


