News February 14, 2026
దుబ్బాకలో 22 ఏళ్ల కౌన్సిలర్

దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో యువత సత్తా చాటారు. మల్లయ్యపల్లి(1వ వార్డు) నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన 22 ఏళ్ల కోటగళ్ల రమ్య ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కాలువ రజితపై 241 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అతి చిన్న వయసులోనే కౌన్సిలర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించిన రమ్యను పలువురు అభినందిస్తున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆమె తెలిపారు.
Similar News
News February 25, 2026
కొత్త పెన్షన్లపై శుభవార్త

AP: కొత్త పింఛన్లపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చిలో 8,977 స్పౌజ్ పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. మార్చి 1న సండే కావడంతో FEB 28నే పెన్షన్లు <<19230790>>అందజేయనున్నట్లు<<>> ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 62.76L మందికి ₹2,725Crను పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. వృద్ధులు, వితంతువులకు ₹4K, దివ్యాంగులకు ₹6K, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ₹10K, మంచానికే పరిమితమైన వారికి ₹15K ఇస్తున్న విషయం తెలిసిందే.
News February 25, 2026
నల్గొండ: అంగన్‌వాడీలపై ‘సర్పంచ్’ పెత్తనమేంటి?

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను సర్పంచులకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో రాజకీయ జోక్యం పెరిగి, చిన్న కారణాలతో కార్యకర్తలు వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ వర్గపోరు వల్ల కేంద్రాల పనితీరు దెబ్బతింటుందని, ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలోనే సేవలు సక్రమంగా అందుతున్నాయని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి.
News February 25, 2026
చైనా అండతో USను టార్గెట్ చేసిన ఇరాన్!

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇప్పటికే అమెరికా యుద్ధనౌకలు ఆ దేశ తీరానికి సమీపంలో మోహరించాయి. దీనికి కౌంటర్‌గా ఇరాన్.. చైనా నుంచి సూపర్ సోనిక్ యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్స్‌ను కొనుగోలు చేయనుంది. ఇప్పటికే డీల్ దాదాపు పూర్తి కావొచ్చిందని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. వీటితో 290 కి.మీ దూరంలోని లక్ష్యాలను అటాక్ చేయవచ్చు. వాటిని అడ్డుకోవడం చాలా కష్టం.


