News February 14, 2026

HYD: మీలాంటి వ్యక్తి మీ కూతురుకి భర్తగా వస్తే?

image

HYDలో 3 ముళ్ల బంధాలు మున్నాళ్ల ముచ్చటవుతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడమే కారణంగా తెలుస్తోంది. నిపుణుల సలహా ఏంటంటే.. మీ కూతురుకి మీలాంటి లక్షణాలున్న వ్యక్తి భర్తగా వస్తే అంగీకరిస్తారా? అలాగే స్త్రీలూ మీ అబ్బాయికి మీలాంటి వ్యక్తి భార్యగా వస్తే అంగీకరిస్తారా? అంగీకరించలేకుంటే అలా మిమ్మల్ని మార్చుకుంటే బంధాలు నిలబడతాయి. యువత ఆత్మపరిశీలన చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని సూచిస్తున్నారు.

Similar News

News February 19, 2026

పోలీసులపై అంబటి రాంబాబు ఆగ్రహం

image

AP: నిన్న జైలు నుంచి విడుదలైన YCP నేత అంబటి రాంబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాజమండ్రి నుంచి గుంటూరుకు ఊరేగింపుగా వెళ్లొద్దని తెలిపారు. దీనిపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ’18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే ఏంటీ నిర్బంధాలు? నేనేమైనా ర్యాలీ తీస్తున్నానా? ఆంక్షలు ఎందుకు? 10 మంది కార్యకర్తలు వచ్చి నన్ను పలకరించడం తప్పా?’ అని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు.

News February 19, 2026

అమలాపురం: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు 40 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కె.చంద్రశేఖర్ బాబు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 13,131 మంది, ద్వితీయ సంవత్సరంలో 12,887 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే బాధ్యతను చీఫ్ సూపర్‌వైజర్లు, అధికారులే తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

News February 19, 2026

GNT: నిధుల వినియోగంపై ఆంక్షలు.. సర్పంచుల ఆవేదన

image

ఏప్రిల్ 2తో సర్పంచుల పదవీకాలం ముగియనున్న వేళ గ్రామాల్లో పనుల బిల్లులపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.70 కోట్లు ఉన్నా వాటిని విద్యుత్ బిల్లులు, చెత్త నిర్వహణకే పరిమితం చేశారు. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని సర్పంచులు అంటున్నారు. ఇప్పటికే చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంక్షలు సడలించాలని అంటున్నారు.