News February 14, 2026
ఓటుకు రూ.70వేలు.. 200+ ఓట్ల మెజారిటీతో గెలుపు

TG: రంగారెడ్డి(D) <<19125637>>మొయినాబాద్<<>> మున్సిపాలిటీలో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఓటుకు రూ.70వేలు, 25kgs బియ్యం పంచినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. నిన్న వెలువడిన ఫలితాల్లో ఆయన 200కి పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ప్రాంతం రియల్టర్లకు గోల్డ్ మైన్‌గా మారడంతోనే గెలుపు కోసం రూ.7కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. స్వతంత్ర అభ్యర్థి కావడంతో ప్రధాన పార్టీల నుంచి ఆయనకు భారీ ఆఫర్ రావొచ్చనే టాక్ వినిపిస్తోంది.
Similar News
News March 3, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 3)

1839: టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జంషేడ్జీ టాటా జననం
1937: రచయిత సత్యం శంకరమంచి జననం
1967: సింగర్ శంకర్ మహదేవన్ జననం
1969: సినీ నటి మధుబాలా జననం
2002: పార్లమెంటు తొలి దళిత స్పీకర్ బాలయోగి మరణం
2003: MRF వ్యవస్థాపకుడు కేఎం మామ్మెన్ మాపిళ్లై మరణం
2008: తెలుగు సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన తొలి నటి నగరాజకుమారి మరణం.
News March 3, 2026
గల్ఫ్ నుంచి తిరిగొస్తున్న భారతీయులు

ఇరాన్ దాడులతో నిలిచిన పోయిన విమాన సేవలను గల్ఫ్ దేశాలు క్రమంగా పునరుద్ధరిస్తున్నాయి. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు తిరిగొస్తున్నారు. ఇప్పటికే అబుదాబి నుంచి ఢిల్లీ, బెంగళూరుకు విమానాలు చేరుకున్నాయి. దుబాయ్ నుంచి కూడా విమానం బయలుదేరింది. కాగా అక్కడి గగనతల స్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ఈరోజు సౌదీలోని భారతీయుల కోసం ఇండిగో పది రిలీఫ్ ఫ్లైట్లు నడపనున్నట్లు తెలుస్తోంది.
News March 3, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


