News May 1, 2024
NZB: మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
10వ తరగతి ఫలితాల్లో తక్కువ (జీపీఏ) మార్కులు వచ్చాయని నవీపేట్ మండలం మహంతం గ్రామానికి చెందిన విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 8.3 జీపీఏ రావడంతో తక్కువగా వచ్చాయని మనస్తాపంతో పొలాల్లో కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్‌కు తరలించారు.
Similar News
News January 12, 2025
రేవంత్ రెడ్డి పాలన RSS రూల్ ప్రకారమే జరుగుతుంది: కవిత
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన అంతా RSS రూల్ ప్రకారమే జరుగుతుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఆరోపించారు. ఆదివారం ఆమె నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ళ కేసీఆర్ పాలనలో మతకల్లోలాల జాడ కనిపించలేదని రేవంత్ సర్కార్ ఏడాది పాలనలోనే ఆందోళన కలిగిస్తుందని అన్నారు. కాగా హామీలలో ప్రధానమైన మైనార్టీ డిక్లరేషన్ (చెవేళ్ళ) వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News January 12, 2025
నిజామాబాద్: తగ్గుముఖం పట్టిన కోడిగుడ్ల ధరలు
కోడి గుడ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత ఆదివారం 100 గుడ్లు రూ.580 పలుకగా ఈ ఆదివారం కోడిగుడ్ల ధరలు తగ్గి 480 కు చేరాయి. అయితే చికెన్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో చికెన్ రూ. 200 నుంచి 240 (స్కిన్ లెస్), స్కిన్‌తో రూ. 180 నుంచి 200గా ఉంది. అయితే మటన్ రేట్లు మాత్రం కిలో రూ. 600 నుంచి 800గా ఉంది.
News January 12, 2025
పిట్లం: ఏటీఎం ధ్వంసం చేసి చోరీ
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని ఎస్బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారని వారు తెలిపారు. క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.