News February 14, 2026

C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(C-DOT)లో 10 సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech, MSc, ME/MTech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్కిల్/ రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdot.in.

Similar News

News February 17, 2026

విజయ్-రష్మిక పెళ్లి: నో ఫోన్.. నో గిఫ్ట్స్.. ఆశీర్వాదం చాలు!

image

విజయ్-రష్మిక Feb 26న ఉదయ్‌పూర్‌(RJ)లో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వేడుక అత్యంత ప్రైవేట్‌గా జరగనున్నట్లు, సెలబ్రిటీలెవరినీ ఆహ్వానించలేదని సమాచారం. ఫొటోలు లీక్ కాకుండా ‘నో ఫోన్ పాలసీ’ అమలు చేస్తున్నారని ‘ఇండియా టుడే’ పేర్కొంది. గిఫ్ట్స్ వద్దని, కేవలం ఆశీస్సులు చాలని కోరుతూ సన్నిహితులకు ఇన్విటేషన్ పంపారట. పెళ్లి తర్వాత నెల రోజులు షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

News February 17, 2026

మొదలవని మ్యాచ్.. ఆస్ట్రేలియా పని అయిపోయినట్లేనా?

image

T20 WC2026: ఆస్ట్రేలియా జట్టు సూపర్-8 భవిష్యత్తును నిర్ణయించే మ్యాచుకు వర్షం అడ్డంకిగా మారింది. పల్లెకెలె స్టేడియంలో వర్షం పడుతుండటంతో జింబాబ్వే vs ఐర్లాండ్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. వర్షం తగ్గే అవకాశాలు లేవని క్రిక్‌బజ్ తెలిపింది. ఈ మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఆస్ట్రేలియా ఈ ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ మ్యాచ్ జరిగి జింబాబ్వే గెలిచినా కంగారూలు ఇంటిదారి పట్టినట్లే.

News February 17, 2026

అంతిమ సంస్కారాల్లో మట్టి కుండను ఎందుకు పగులగొడతారు?

image

హిందూ ధర్మంలో మట్టి కుండను మానవ శరీరానికి, దానిలోని నీటిని ఆత్మకు ప్రతీకగా భావిస్తారు. ప్రదక్షిణ సమయంలో చిల్లుల నుంచి కారే నీరు, శరీరం-ఆత్మ మధ్య బంధం క్రమంగా వీడిపోవడాన్ని సూచిస్తుంది. చివరగా కుండను పగలగొట్టడం అంటే.. ప్రాపంచిక బంధాలన్నీ తెంచుకుని, పంచభూతాలతో నిర్మితమైన శరీరం తిరిగి ప్రకృతిలో కలిసిపోయిందని, ఆత్మ మోక్ష మార్గంలో స్వేచ్ఛగా పయనించాలని అర్థం. ఇది ఆత్మ అంతిమ విముక్తికి ప్రతీక.