News May 1, 2024
భారత జట్టులో నటరాజన్ ఉండాల్సింది: నటుడు శరత్ కుమార్
T20 WC కోసం BCCI ఎంపిక చేసిన భారత జట్టుపై నటుడు శరత్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘దేశమన్నా, భారత జట్టన్నా మాకు ఎప్పుడూ ఇష్టమే. కానీ తమిళ పేర్లు లేకపోవడం నిరుత్సాహం కలిగించింది. నటరాజన్ బౌలింగ్ వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. డెత్ ఓవర్లలో అతడు అద్భుతమైన యార్కర్లు సందిస్తాడు. అతడిని తిరిగి జట్టులోకి తీసుకునేందుకు ఆలస్యం చేయవద్దు’ అంటూ ట్వీట్ చేశారు.
Similar News
News January 1, 2025
ఏడాది తొలిరోజే పసిడి ప్రియులకు షాక్
ఈ ఏడాది బంగారం ధరలు మరింత ఎగబాకొచ్చనే మార్కెట్ నిపుణుల <<15030717>>అంచనాలకు<<>> అనుగుణంగా ఇవాళ రేట్లు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి రూ.78వేలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేట్ రూ.400 పెరిగి రూ.71,500గా నమోదైంది. అటు కేజీ సిల్వర్ రేట్ రూ.98వేలుగా కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.
News January 1, 2025
రేపే రాజమౌళి-మహేశ్ సినిమా లాంచ్!
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాను రేపు లాంచ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో ఉ.10 గంటలకు పూజా కార్యక్రమం జరగనుందని పేర్కొన్నాయి. RRR తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీని రూపొందించాలని జక్కన్న ప్లాన్ చేసినట్లు సమాచారం.
News January 1, 2025
అలసత్వం వహిస్తే సహించం: మంత్రి పొన్నం
TG: గురుకుల స్కూళ్లలో విద్యార్థులకు మౌలిక వసతులు, భోజనం విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. గురుకుల సొసైటీ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన ఆయన, తరచుగా హాస్టళ్లలో తనిఖీలు చేయాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అడ్మిషన్‌తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.