News February 14, 2026

వరంగల్ బల్దియాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు!

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారులు అర్హతలేని 15 మందికి అక్రమ మార్గాన ఉద్యోగాలు కట్టబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞాన అర్హత లేని వారికి అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఉద్యోగాలు కట్టబెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో వ్యక్తి నుంచి రూ.1,50,000 పుచ్చుకొని చైన్‌మెన్ ఉద్యోగాలు కల్పించినట్లు బల్దియాలో చర్చ జరుగుతోంది.

Similar News

News February 20, 2026

పెద్దపల్లిలో 24న జాబ్ మేళా.. 51 ఉద్యోగావకాశాలు

image

PDPL జిల్లా ఉపాధి కార్యాలయంలో FEB 24న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపారు. సాక్సెస్ ప్రాజెక్టు ఎల్‌ఎల్‌పి సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 50, మార్కెటింగ్ మేనేజర్ 1 పోస్టు ఖాళీగా ఉంది. 10వ తరగతి నుంచి డిగ్రీ, ఎంబీఏ అర్హతలతో 18-36 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చు. నూతన కలెక్టర్ భవనం, రూమ్ నం.233లో సర్టిఫికేట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.

News February 20, 2026

ఏలూరు కార్పొరేషన్‌పై పట్టుకు ప్రయత్నాలు

image

కూటమి నేతలు, వైసీపీ నాయకులు ఏలూరు <<19193902>>కార్పొరేషన్‌<<>> చేజక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కూటమి కోటాలో జనసేన టికెట్ రెడ్డి అప్పలనాయుడు వదులుకోగా, తన అభ్యర్థిని దింపి పగ్గాలు పట్టేందుకు వ్యూహం పన్నుతున్నారు. మరోవైపు ఏలూరులో కీలకమైన కార్పొరేషన్లోనూ తమ అభ్యర్ధిని బరిలోకి దింపి పట్టుకోసం MLA చంటి వర్గం ప్రయత్నాలున్నాయి. ఎన్నికల్లో వైసీపీ, కూటమిల మధ్యే పోటీ కాకుండా JSP,TDPల మధ్య పోరు ఉండనుంది.

News February 20, 2026

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి: మెదక్ కలెక్టర్

image

10వ తరగతి పరీక్షల్లో జిల్లాలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి జడ్పీ హైస్కూల్లో ప్రత్యేక తరగతులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. బట్టి పద్ధతికి దూరంగా ఉండి అంశాలపై పట్టు సాధించాలని, ప్రతిరోజూ ప్రత్యేక తరగతులకు హాజరుకావాలని సూచించారు. టీవీ, మొబైల్, సోషల్ మీడియాలకు దూరంగా ఉండి ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించాలన్నారు.