News February 14, 2026

MDK: పార్టీ మారి గెలిచినా.. ఆశలు గల్లంతు!

image

రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 5వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ చరిత విజయం సాధించారు. కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో ఆమె తండ్రి సుప్రభాత్ రావు బీఆర్‌ఎస్‌లో చేరి కుమార్తెను గెలిపించుకున్నారు. అయితే మున్సిపల్ పీఠం దక్కించుకోవడంలో బీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించలేకపోవడంతో ఛైర్మన్ పదవిపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. గెలిచినా నిరాశే ఎదురైంది.

Similar News

News February 20, 2026

ALL TIME HIGH: ఫారెక్స్ నిల్వలు $725.72 బిలియన్లు

image

భారత ఫారెక్స్ నిల్వలు FEB 13 నాటికి $8.66bn పెరిగి ఆల్ టైం హై $725.72bnకు చేరినట్లు RBI వెల్లడించింది. కరెన్సీ అసెట్స్ (డాలర్, యూరో, పౌండ్, యెన్) $3.55bn ఎగసి $573.60bnకు చేరింది. బంగారం నిల్వల విలువ $4.99bn పెరిగి $128.46bnకు చేరుకుంది. ఇక స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(SDR) $103 మిలియన్లు పెరిగి $18.92bnకు చేరాయి. IMF వద్ద దేశ నిల్వలు $19 మిలియన్లు పెరిగి $4.73bnకు చేరుకున్నాయి.

News February 20, 2026

తిరుపతి: సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా

image

ఇంటర్ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా 4 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. వాటిలో నాయుడుపేట, కోట, నాగలాపురం, పిచ్చాటూరు ఉన్నాయి. గతంలో ఉన్న సెల్ఫ్ సెంటర్లను రద్దు చేసి 8 జంబ్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్‌తో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కేంద్రంలోని ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు రికార్డ్ చేయనున్నారు.

News February 20, 2026

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 20 ఫిర్యాదులు

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకారరావు ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 20 వినతులు అందాయి. పట్టణ ప్రణాళికా విభాగంపై వచ్చే ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కారానికి ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అత్యధికంగా నార్త్ జోన్ నుంచి 6 వినతులు రాగా.. అధికారులు వెంటనే స్పందించి వీటిని పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.