News February 14, 2026

పెద్లపల్లి: మూడు మున్సిపాలిటీల్లో ఒక్కొక్క వార్డులో గెలుపు

image

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగగా ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణులను నివ్వెర పరిచాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఒక్కొక్క వార్డులోనే గెలుపుతో ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పెద్దపల్లిలో 36 వార్డుల్లో ఒకటి, సుల్తానాబాద్ లో 15 వార్డుల్లో ఒకటి, మంథనిలో 13 వార్డులకు ఒకటి చొప్పున మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది.

Similar News

News February 19, 2026

అల్లూరి జిల్లాను మోడల్ జిల్లాగా మార్చడమే లక్ష్యం: కలెక్టర్

image

అల్లూరి జిల్లాను రాష్ట్రంలోనే ఒక మేటి మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. గురువారం విశాఖలో జరిగిన నీతి అయోగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయం, పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. సహజసిద్ధ అందాలను ప్రపంచానికి పరిచయం చేసి, అరకు, లంబసింగి ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు

News February 19, 2026

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్: రాఘవేంద్రరావు స్థానంలో భరద్వాజ

image

TG: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 జ్యూరీ కమిటీలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. దర్శకుడు రాఘవేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజకు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు సినిమాటోగ్రఫీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

News February 19, 2026

అమరావతిలో పలు సంస్థలకు భూములు

image

అమరావతిలో వివిధ సంస్థలకు సబ్ కమిటీ భూములు కేటాయించింది. రెయిన్‌బో ఆసుపత్రికి 2ఎకరాలు, వాతావరణ శాఖ, నాబార్డ్‌లకు ఎకరం చొప్పున స్థలాలు ఇచ్చారు. పీఎన్‌బీ, కరూర్ వైశ్యా బ్యాంకులకు కూడా భూములు దక్కాయి. మొత్తం 22 ప్రతిపాదనలు చర్చించి, 7 కొత్త సంస్థలకు ఆమోదం తెలిపారు. 11 పాత కేటాయింపుల్లో మార్పులు చేశారు. బ్యాంకు ఉద్యోగుల ఇళ్లకూ అనుమతిచ్చారు. ఇప్పటికే స్థలాలు పొందిన సంస్థల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు.