News February 14, 2026
ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక.. బందోబస్తుపై సమీక్ష

MHBD మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. శనివారం టౌన్ CI మహేందర్ రెడ్డితో కలిసి DSP, RDO, కమిషనర్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈనెల 16న జరిగే ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని DSP ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News February 15, 2026
దేశంలో ఎక్కడా లేదు.. శ్రీకాళహస్తిలోనే..!

శ్రీకాళహస్తి క్షేత్రంలో అనేక విశేషాలు మనకు కనిపిస్తాయి. ఆలయ ప్రధాన ముఖద్వారం, నందీశ్వరుడు, బలిపీఠంతో పాటు దారు ఏకశిలా ధ్వజస్తంభం ఉంటాయి. ధ్వజస్తంభం పైన చిన్న నంది ఉంటుంది. ఇటువంటి దారు ఏకశిలా ధ్వజస్తంభం భారతదేశంలో మరెక్కడా లేదు.
News February 15, 2026
కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీకి మెజారిటీ లేదు: పొన్నం

నిజామాబాద్ లాగానే కరీంనగర్ కార్పొరేషన్ లోనూ బీజేపీకి మెజారిటీ లభించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన వేములవాడలో మాట్లాడుతూ.. కరీంనగర్ లో మేమే గెలిచామని ప్రకటించిన బండి సంజయ్ 66+ఎంపీ+ లోకల్ ఎమ్మెల్యే + మానకొండూరు ఎమ్మెల్యే కలిసి మొత్తం 69 స్థానాలు ఉండగా బీజేపీకి 30 మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. బీజేపీ లాగానే అన్ని పార్టీలకు వ్యూహాలు ఉంటాయని ఆయన తెలుసుకోవాలన్నారు.
News February 15, 2026
‘రాజన్న ఆలయ సీసీ ఫుటేజీ వెంటనే బహిర్గతం చేయాలి’

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సీసీ ఫుటేజిని వెంటనే బహిర్గతం చేయాలని బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వేలాదిమంది భక్తులు భీమేశ్వర స్వామిని దర్శించుకుండగా, ఓ ప్రైవేటు వ్యక్తి ఆలయ సిబ్బంది సహకారంతో రాజన్నను దర్శించుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


