News May 1, 2024
బెల్లంపల్లి: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత రవి మృతి

బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీకి చెందిన కాసర వేణి రవి అలియాస్ అశోక్ ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. రాజయ్య-లక్ష్మి దంపతుల నలుగురు సంతానంలో రవి చిన్నవాడు. పిన్న వయసులోనే పీపుల్స్ వార్ పార్టీ అనుబంధ సంఘం సీకాసకు ఆకర్షితుడై 1991ప్రాంతంలో విప్లవ బాట పట్టాడు. సింగరేణి కోల్ బెల్టులో చాలాకాలం పనిచేసి దండకారణ్యానికి బదిలీ అయ్యారు. రవి తుది శ్వాస వరకు విప్లవ మార్గాన్ని వీడలేదు.
Similar News
News March 21, 2026
ADB: గ్యాస్ కొరత లేదు.. పుకార్లను నమ్మకండి: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న అసత్య వార్తలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. వినియోగదారులు సిలిండర్లు బుక్ చేసుకుంటే నిర్ణీత గడువులోగా నేరుగా ఇంటికే డెలివరీ చేయబడతాయని, ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లాలో సరఫరా వ్యవస్థ సజావుగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
News March 21, 2026
ఆదిలాబాద్: జనగణన పారదర్శకంగా జరగాలి – కలెక్టర్

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న జనగణన (సెన్సస్-2027) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. స్థానిక టీటీడీసీలో టెక్నికల్ అసిస్టెంట్లు, క్లర్కులకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, ఎక్కడా తప్పులు దొర్లకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.