News February 14, 2026

కేయూ నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం!

image

కేయూ పరీక్షల విభాగం అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఫలితాలు విడుదలై 2 రోజులు కావస్తున్నా కొన్ని కళాశాలల విద్యార్థుల ఫలితాలు కానరావడం లేదు. ఓల్డ్ విద్యార్థులకు అనుమతులిచ్చిన అధికారులు వారు ఫీజులు చెల్లించలేదని ఆయా కళాశాలల రెగ్యులర్ విద్యార్థుల ఫలితాలను నిలిపివేశారు. అన్ని ఫీజులు చెల్లించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల ఫలితాలను నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

Similar News

News February 28, 2026

HPV వ్యాక్సినేషన్ చేపట్టేందుకు పటిష్ట కార్యాచరణ: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో 9 నుంచి 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు HPV వ్యాక్సినేషన్ చేపట్టేందుకు పటిష్ట కార్యాచరణ చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. దీని వల్ల మహిళల్లో సర్వైవల్ క్యాన్సర్ రాకుండా చేయవచ్చని తెలిపారు. అటు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్నం భోజన నాణ్యతను జిల్లా అధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

News February 28, 2026

చిత్తూరు MLAలకు ఇవి కనబడటం లేదా..?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా, మామిడి రైతులు ఏటా కష్టాలు తప్పడం లేదు. ఆశించిన మేర ధరలు ఉండటం లేదు. మామిడి బోర్డు, టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఏటా ఎన్నికల్లో నాయకులు హామీ ఇస్తున్నారు. గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. టమాటా, మామిడి రైతుల కష్టాల గురించి ఏ ఒక్క MLA ప్రస్తావించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

News February 28, 2026

WGL: వాళ్లు లోపల.. వీళ్లు బయట!

image

విధి విచిత్రం అంటే ఇదేనేమో. మావోయిస్టులకు సానుభూతి వ్యక్తం చేశారంటూ పౌరహక్కుల సంఘాల నేతలను అర్బన్ నక్సల్స్ అంటూ జైల్లో పెట్టారు. మావోయిస్టు అంత్యక్రియలకు హాజరైనందుకు గాదె ఇన్నారెడ్డి జైళ్లో ఉన్నారు. ఇటీవల ఆయన తల్లి చనిపోగా, <<19260305>>ఈరోజు తండ్రి సైతం <<>>మరణించారు. మరోపక్క అజ్ఞాతం వీడిన మాజీ మావోయిస్టు నేతలు సీఎం కార్యాలయంలో కుర్చీలపై కూర్చొని ఫొటోలు దిగుతున్నారు. దీన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.