News May 1, 2024
నిజామాబాద్ జిల్లాకు ప్రియాంక లేదా రాహుల్ గాంధీ రాక?

లోకసభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీలో ఎవరో ఒకరు నిజామాబాద్ జిల్లాకు రానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మే 7-8 తేదీల్లో జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం వారిలో ఒకరు వస్తారని ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం వచ్చిందంటున్నారు. ఈ మేరకు నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాకు మధ్యలో ఉండే ఆర్మూర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో నేతలు ఉన్నారు.
Similar News
News March 10, 2026
NZB: ఇంటర్ పరీక్షలు.. 377 మంది గైర్హాజరు

NZB జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం భౌతికశాస్త్రం, అర్ధ శాస్త్రం, ఒకేషనల్ పరీక్షలకు 377 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DIEO రవికుమార్ తెలిపారు. మొత్తం 16,678 మంది విద్యార్థులకు గాను 16,301 మంది హాజరయ్యారన్నారు. జనరల్‌లో 14,305మంది విద్యార్థులకు గాను 13,997 మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో 2,373 మంది విద్యార్థులకు గాను 2,304 మంది పరీక్షలు రాశారు.
News March 10, 2026
NZB: తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యం

కోటగిరి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి(27) తన ఇద్దరు పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. స్థానికంగా, బంధువుల వద్ద వెతికినా వారి ఆచూకీ లభించలేదని భర్త గంగాధర్ పేర్కొన్నారు. అలాగే కొత్తపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సాయిలు(27) హోటల్‌కు వెళ్తానని చెప్పి కనిపించకుండా పోయారు. ఇరువురి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై సునీల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 10, 2026
నిజామాబాద్: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బూరుడుగల్లీలో సతీష్ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లారెడ్డిలో ఇల్లరికం ఉన్న సతీష్, భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇటీవల నగరానికి తిరిగి వచ్చి పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. 2వ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


