News May 1, 2024
బీజేపీ, బీఆర్ఎస్‌లు ప్రజలను మోసం చేస్తున్నాయి: మంత్రి

బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గానికి చెందిన రఘురాం రెడ్డిని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేశామన్నారు.
Similar News
News March 3, 2026
ఖమ్మం: ఇంటింటికీ నల్లా.. పంచాయతీలకే తాగునీటి బాధ్యత

ఖమ్మం జిల్లాలో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ‘జల్ జీవన్ మిషన్’ పథకం సిద్ధమైంది. ఈ పథకంలో భాగంగా గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులైన్ల నిర్వహణ బాధ్యతలను ఇకపై నేరుగా గ్రామ పంచాయతీలకే అప్పగించనున్నారు. సర్పంచి అధ్యక్షతన ఉండే ‘గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల’ ద్వారా ప్రతి ఇంటికీ 100 శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చి, నిరంతర సరఫరాను పర్యవేక్షిస్తారు.
News March 3, 2026
ఖమ్మం: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఫలితాలు విడుదల

ఖమ్మంలో జనవరిలో నిర్వహించిన డ్రాయింగ్ హయ్యర్, లోయర్ అలాగే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసినట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, రోల్ నంబర్ నమోదు చేసి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు.
News March 3, 2026
నేడు ఖమ్మం కమిషనరేట్‌లో మద్యం దుకాణాలు బంద్

హోలీ పండుగను పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మార్చి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


