News May 1, 2024

ఖమ్మం లోక్‌సభ బరిలో త్రిముఖ పోరు.!

image

నిన్న, మొన్నటి వరకు ఖమ్మంలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ పర్యటన, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదని సంకేతాలు కనిపిస్తున్నాయి. BRS అభ్యర్థి నామా, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి, BJP తాండ్ర వినోద్ రావు మధ్య రసవత్తర పోరు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Similar News

News March 21, 2026

నేరాల నియంత్రణే లక్ష్యం: పోలీస్ కమిషనర్ సునీల్ దత్

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు బ్యాంకులు, ఏటీఎంలు, ప్రధాన కూడళ్ల వద్ద పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా వాహన సోదాలు నిర్వహించారు. రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేశారు.

News March 21, 2026

మధిర: 9 పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం

image

మధిర నియోజకవర్గంలో రానున్న విద్యా సంవత్సరం నుంచి 5 మండలాల్లో 9 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పాఠశాలలో 800–1000 మంది విద్యార్థులు చదివేలా ప్రణాళిక రూపొందించారు. ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల్లో ఈ స్కూల్స్ ఏర్పాటవుతాయి. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు బోధన అందించనున్నారు. విద్యార్థులను సమీప గ్రామాల నుంచి రవాణా ద్వారా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 20, 2026

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాల (SC) యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు www.tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.