News February 15, 2026

తిరుపతి స్విమ్స్‌లో ఉద్యోగాలు

image

తిరుపతి స్విమ్స్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మెడికల్ ఆఫీసర్లు-4, స్టాఫ్ నర్సులు-4, ఏఎన్ఎం-4, మమోగ్రఫీ టెక్నీషియన్-2, కార్డియో వాస్క్యలర్ టెక్నీషియన్ గ్రేడ్-2, డీఏవో-2, పీఆర్వో-2, మెడికో సోషల్ వర్కర్-2, ఎలక్ట్రీషియన్62, డ్రైవర్లు-2 పోస్టులు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు svimstpt.ap.nic.in వెబ్‌సైట్ చూడాలి.

Similar News

News April 11, 2026

ADB: కారుణ్య నియామకాల్లో 16 మందికి ఉత్తర్వులు

image

జిల్లాలో కారుణ్య నియామకాల కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎంపికైన 16 మంది అభ్యర్థులకు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నియామక ఉత్తర్వులను అందజేశారు. 10 రెవెన్యూ , 2 సేల్స్ టాక్స్, 1 వెల్ఫేర్, 1 వైద్య శాఖ, 1 అకౌంట్స్, 1 ఇరిగేషన్ శాఖలకు కేటాయించారు.మొత్తం 15 జూనియర్ అసిస్టెంట్, ఒక ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పత్రాలిచ్చారు.

News April 11, 2026

ADB: ఏజెన్సీలో టెనెన్సీ భూముల భారీ స్కామ్..!

image

ASF, ADB ఏజెన్సీలో టెనెన్సీ భూములపై భారీ స్కామ్ వెలుగుచూసింది. 1954కు ముందు నిజాం కాలంలో భూములు గ్రామ అధికారుల పేర్లపై ఉండేవి. వారు ఆ భూములను రైతులకిచ్చి కౌలు వసూలు చేసేవారు. అయితే స్వాతంత్ర్యం తర్వాత అప్పటి ప్రభుత్వం రక్షిత కౌలు చట్టం ద్వారా ఆ భూములపై కౌలు రైతులకు హక్కులు కల్పించింది. ప్రస్తుతం అప్పటి గ్రామ అధికారుల వారసులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై దాదాపు 50వేల ఎకరాల్లో స్కామ్‌కు తెరలేపారు.

News April 11, 2026

అల్లూరి: వాగులో మునిగి యువకుడు మృతి

image

అల్లూరి జిల్లా చింతూరు మండలం సోకులేరు వాగులో మునిగి ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన కాంతటి రమేష్ శనివారం మృతి చెందాడు. సోకులేరు వ్యూ పాయింట్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. విహార యాత్రకు వచ్చిన ఇతను వాగులో దిగి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినట్లు చింతూరు సీఐ సీహెచ్ గోపాలకృష్ణ తెలిపారు.